Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
4 లేబర్ కోడ్స్ రద్దుకై చికాగో అమరవీరుల స్ఫూర్తి తో పోరాడుదామని ఏఐకే ఎంఎస్ జిల్లా సహాయ కా ర్యదర్శి గుజ్జు దేవేందర్, ఐ ఎఫ్టియు ఏరియా కార్యదర్శి పసునూరి రాజమల్లులు అన్నారు. మేడే ఉత్సవాల లో భాగంగా ఐఎఫ్టియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రా మాల సెంటర్లలో మే డే జెండా ఆవిష్కరణ చేశారు. కొత్తగూడ ప్రధాన రహదా రి గుండా ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్సిఐ గోదాంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు కొనకటి మల్లారెడ్డి,ఆటో యూనియన్ గద్దెపై ఇఫ్ట్ ఏరియా కార్యదర్శి రాజమల్లు, టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరుపున నామోజు క్రిష్ణ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరుపున జిల్లా కార్యదర్శి గుగ్గిల్ల వెంకన్నలు కార్మి క జెండా ఆవిష్కరించారు. అనంతరం న్యూడెమోక్రసీ కార్యాలయంలో తాటికా యల వెంకీ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐకెఎంఎస్ జిల్లా సహాయకార్యదర్శి గుజ్జు దేవేందర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్ సామ్రాజ్యవాదం బహుళ జాతి కంపెనీలకు దాసోహం అంటూ అనేక సంవత్సరములుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చివేసి చట్టం తీసుకువచ్చిందని దీని మూలంగా ఎంతో మంది కార్మికులు అమరత్వం పొంది సాధించుకున్న కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మిక కర్షక ఐక్యతతో ముందుకు సాగుతూ మే డేను మరింత ఉత్సాహపూరితంగా ఘనంగా జరుపు కొని, కార్మిక వర్గ ఐక్యతను చాటి చెప్పాలని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్క వెంకటయ్య, యుగేందర్, సాంబరాజు, జీవన్ బుచ్చిరాము లు, సురేందర్, పూర్ణచందర్, గట్టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.