Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా మేడే
నవతెలంగాణ-పాలకుర్తి
ఎర్రజెండా నాయకత్వంలో కార్మికులు,కర్షకులుహక్కులను పోరాడి సాధించు కుంటే నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులు కాలరాస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, సీపీ ఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్యలు విమర్శించారు. ప్రపంచ కార్మిక దినో త్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ చౌరస్తా నుండి రాజీవ్ చౌరస్తా వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. గూడూరులో ఎర్రజెండాలు చేత గునిన కా ర్మిక లోకం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గుడివాడ చౌరస్తాలో సిఐటియు జెండా ఐలమ్మ స్మారక స్థూపంతో పాటు, రాజీవ్ చౌరస్తాలో సిపిఎం జెండాలు ఎగురవేశారు. మండలంలోని గూడూరు, బొమ్మెర, ఈరవెన్ను. కోతుల బాధ, దర్ద పల్లి, తొర్రూరు, వల్మిడితో పాటు పలు గ్రామాల్లో మేడే సందర్భంగా ఎర్రజెండాలు రెపరెపలాడాయి.ఈ సందర్భంగా సోమయ్య, సారయ్యలు మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రవేట్ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నా రని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వల్ల కార్మికులను నిర్వీర్యం చేసే ప్రయ త్నం చేస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి మనువాద సిద్ధాంతా న్ని అమలులోకి తీసుకొచ్చే కుట్రకు కేంద్ర ప్రభుత్వం బీజం వేసే ప్రయత్నం చేస్తుం దని ఆరోపించారు.రైతులంతా ఐక్యమత్యంతో పోరాటంచేసి మోడీప్రభుత్వం చట్టా లను వెనక్కి తీసుకునేలా గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి రాజుల సాంబయ్య, సోమ సత్యం, ఏదునూరి మదర్, సోమ అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, పనికిరా రాజు, రాపర్తి మంజుల, చిలువేరు సంధ్య, అం బటి సోమయ్య, సంగి అనిత, పెండ్లి భాస్కర్, సంధ్యారాణి,రజిత, ఏనుగతల వెం కన్న, గాదెపాక కొమురయ్య, తోట రాజు, చిట్యాల సంధ్యారాణి, కాకర్ల బాబు, ఎడ్ల బిక్షపతి, మంద సంపత్, దేవేంద్రం, సోమయ్య, ఆంజనేయులు, కాకర్ల రమేష్, బక్క రాజేశ్వరి, గాదరి ఇస్తారి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : ఎర్రజెండా నాయకత్వంలో నాడు కార్మికులు కర్షకులు ఎన్నో హ క్కులు సాధించుకుంటే నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులు కాలరాస్తుందని సిపిఎం జిల్లా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు సింగారపు రమేష్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో సోమవారం సీఐటీయూ, సీపీఎం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెం డాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఐక్యమత్యంతో ఉన్న ప్రజల మధ్య మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల బిక్షపతి, మాధవ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆంజనే యులు, అయోధ్య, నరసయ్య, ఉప్పలయ్య, లింగయ్య, పద్మ, వెంకటరెడ్డి, రామచం ద్రు, పరశురాములు, మొగిలాన, యాదగిరి, ప్రవీణ్, అంజయ్య, శ్రీనునాయక్, రా ములు, నారాయణ, ప్రణరు, పాల్గొన్నారు.