Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రోజే తరలివచ్చిన సందర్శకులు
నవతెలంగాణ-మంగపేట :శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మౌత్సవాలు సోమవారం ఉదయం 10 గంటలకు అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుండి వచ్చిన అమరవాది యాజ్ఞికులు మురళీకష్ణమాచార్యుల బంధం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అక్కడ నుండి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించిన కళ్యాణ మండపంలో ఉంచి అంకుర్పణ క్రతువును ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలతోపాటు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ అళ్వార్ తిరుమంజనం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ చైర్మన్ నూతులకంటి ముకుందం, రుత్వికులు పెరంబుదూరు మదన్మోహనాచార్యులు, పవన్కుమారాచార్యులు, రామనర్సింహాచార్యులు, వెంకటాచార్యులు, భరద్వాజాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కాలమల రాజశేఖరశర్మ, వెంకటనారాయణశర్మ, రాజీవ్ ఫణిశర్మ, పవన్ కుమారాచార్యులు, ఈశ్వరచంద్ రామానుజ, సిబ్బంది సీతారాములు, సుధీర్, గణేష్, అజయ్, నవీన్, నాగార్జున, పుల్లయ్య, నాగేశ్వరరావు, నర్సింహారావులు పాల్గొన్నారు.