Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-మట్టేవాడ
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్ల కార్మికుల తో మే డేను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్మికుల అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్ శివనగర్ ఇసుకఅడ్డా జంక్షన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ.సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు హాజరై జెండా ఎగురవేశారు. పోస్ట్ ఆఫీస్ కూడలిలో 27 28 డివిజన్లో కార్పొరేటర్లు చింతాకుల అనిల్ కుమార్, గందె కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలలో ఆటో రిక్షా కార్మికులు మున్సిపల్ కార్మికులు అంగన్వాడి టీచర్లతో కలిసి ఉత్సవాలను జరుపుకున్నారు. 12 మోరీల జంక్షన్, శంభునిపేట, ఊర్సు, కరీమాబాద్, ఎంజీఎం సర్కిల్ పోచం మైదాన్ కూడలి, కొత్తవాడ, ఆటోనగర్, పలు ప్రాంతాల్లో బీఆర్టిఎస్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అహర్నిశలు కష్టపడుతూ తమ జీవనం సాగించే ప్రతి కార్మికుడు ఉన్నంతగా ఎదగాలని ఒక కార్మిక బిడ్డగా అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలుపంచుకుంటున్నానని అన్నారు. కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ సుధాకర్ తో కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్, సోమిశెట్టి ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి,డివిజన్ అధ్యక్షులు వినరు ,కార్మిక నాయకులు శ్రీనివాస్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.