Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ప్రకటించాలి
- కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-చిట్యాల
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని, చల్లగరిగ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి చేతికందే సమయంలో వరి మొక్కజొన్న పంటలు అకాల వర్షం కారణంగా కన్నీళ్లే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులను నిలువునా ముంచిందన్నారు. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలను రెవెన్యూ అధికారులు సర్వే చేసి, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వరి, మొక్కజొన్న, పలు పంటలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో గతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలో రైతులు ధాన్యం పోసుకొని రోజులు గడుస్తున్న ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు పోరాడుతామన్నారు. జీఎస్సార్ వెంట జిల్లా నాయకులు, సీఆర్ పల్లి సర్పంచ్ మోకిరాల మధువంశీకష్ణ, ఎంపీటీసీ దబ్బెట అనిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్, ముఖ్య నాయకులు దొడ్డి కిష్టయ్య, చిలుకల రాయకొమురు, నల్ల రాజిరెడ్డి, దూదిపాల బుచ్చిరెడ్డి, జయపాల్ రెడ్డి, గుండ చందర్, మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, మండల నాయకులు మోతె రాజమౌళి, తిప్పి కష్ణారెడ్డి, ప్రభాకర్, గజ్జి రమేష్, అల్లం ఓదెలు, కౌడ గాని నవీన్, అచ్చే సంతోష్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఉన్నారు.
గణపురం : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే అన్నివిధాలా ఆదుకోవాలని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బస్వరాజుపల్లి గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. వరి పొలాల్లో వడ్లు రాలిపోయి, నేలవాలిన పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటలను రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఒక్కో ఎకరానికి రూ.50వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, ఎంపీటీసీ జంగిలి సుధాకర్, నాయకులు కట్ల మల్లయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.