Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు సంవత్సరాలుగా ఎదురుచూపులు
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్
తెలంగాణ ప్రభుత్వం 2018 సాధారణ ఎన్నికల సందర్భంగా 57 సంవత్స రాలు నిండిన పౌరులందరికీ ఆసరా పెన్షన్ ఇస్తానని ప్రకటించింది.ఎన్నికల అనం తరం కొద్ది రోజుల్లో అందజేస్తామన్న పెన్షన్ ఐదు సంవత్సరాలైనా అమలు కా లేదు. ఓటర్ల లిస్టు జాబితా ప్రకారం 57 సంవత్సరాలు నిండిన వారు అనధికార లెక్కల ప్రకారం పది నుంచి 12 వేల వరకు ఉంటారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గతరెండు సంవత్సరాల క్రితం 2000 మందికి, ఇటీ వల కాలంలో రెండున్నర వేల మందికి అన్ని రకాల పెన్షన్లను కలిపి అందజేసింది. ఇందులో వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేతకార్మికులు వీరితోపాటు సామాజిక పెన్షన్‌కు అర్హత కలిగిన వారు ఉన్నారు. డిసెంబర్ కంటే ముందు ఆసరా పెన్షన్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయమన్నారు. ప్రస్తుతం నేరుగా ఎంపీడీవో కార్యాలయంకు అందజేయమంటున్నారు. ప్రస్తుతానికైతే 57 సంవత్సరాలు నిండిన పెన్షన్ అర్హత కలిగిన వారి పూర్తి జాబితా ప్రభుత్వం తీయ గలిగితే తీయవచ్చు కానీ అట్టి ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటివరకు 57 సంవ త్సరాలువయస్సు నిండిన వారి దరఖాస్తులు వివిధ గ్రామాలవి 274 వరకు ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. వీరితోపాటు భర్త చనిపోయిన వితంతువుల సం ఖ్య ఇందులో సమానంగా ఉంటుంది. గ్రామాల్లో కొన్నిచోట్ల భర్త చనిపోయి గత మూడు సంవత్సరాలు అయినను పెన్షన్ అందిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ చూపి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అర్హులైన లబ్ధి దారులందరికీ పెన్షన్ వెంటనే అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
వి.అశోక్ కుమార్ : ఎంపీడీవో, పాలకుర్తి
రెండవసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం 2500 మంది, ఇటీవల కాలంలో 2500 మందికి అన్ని రకాల పెన్షన్లు కలి పి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో పెన్షన్ కొరకు దరఖాస్తు చే సుకున్న వారి జాబితా పెండింగ్ లిస్టు మాదగ్గర లేదు. ఇటీ వల మంజూరు చేసిన పెన్షన్లు కూడానేరుగా ఆన్లైన్లో ద్వారానే మంజూరు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం పెన్షన్ కొరకు దరఖాస్తు పెట్టుకున్న వారి వివరాలు ఆన్లైన్లో చే యడానికి కూడా సైటు పనిచేయడం లేదు.
బక్క పుల్లయ్య : సర్పంచ్ తిరుమలగిరి
భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా వితంతు పెన్షన్ మంజూరు కావడం లేదు. వికలాంగులకు సంబంధించి సదరన్ క్యాంపు పేరుకే పెడుతున్నారు. ఆన్లై న్లో దరఖాస్తు చేయడానికి కొద్ది గంటలు మాత్రమే సమ యం ఇస్తున్నారు. దీనివల్ల వికలాంగులకు పూర్తిగా న్యా యం జరగడం లేదు. ఇచ్చిన వికలాంగుల సర్టిఫికేట్కాల పరిమితి రెండు సంవ త్సరాలు పెడుతున్నారు. మళ్లీ రెన్యూవల్ చేసుకుందామంటే అవకాశం దొరకకుం డా ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.ఇప్పటికైనా సరి అయిన పర్సంటేజ్ వికలాంగత్వం ఉన్నవారికి పర్మినెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రభుత్వ స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.