Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
పరకాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివద్ధి చేస్తున్న పనుల ను చూసి ఆదరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.బుధవారం ఆ త్మకూరు మండల కేంద్రంలో రూ.3.50 కోట్లతో నూతనంగా వేసిన సిమెంటు రోడ్లను, కట్టు కాలువను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా రూ.20 లక్షలతో పీహెచ్సీ ఉపకేంద్ర భవననిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆత్మకూర్పెద్ద చెరువు నుండి బ్రాహ్మణపళ్లి చెరువులోనికి నీటిని విడు దల చేశారు.అక్కడి నుండి అధికారులు,ప్రతినిధులతొ కలిసి గ్రామమంతా కలియ తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కోట్లాది రూపా యలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అ న్ని విధాలుగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కో సం ప్రభుత్వం నుంచి వరదలాగా నిధులు తీసుకువచ్చి శక్తి వంచన లేకుండా అభి వృద్ధి చేస్తున్నాననిపేర్కొన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాన్ని ఆద ర్శంగా తీర్చిదిద్దుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలన్నారు. ఇప్పటికే దళిత బంధు,డబుల్ బెడ్రూంలతొ పాటు అ నేక సంక్షేమ పథకాలను అందించానన్నారు.ప్రతి కుటుంబానికి పార్టీలకుతీతంగా సంక్షేమ పథకాలు అందించానన్నారు.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని ఆదే శించారు. అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఎవరికి ఏ అవసరం వచ్చిన నా తలుపు తడితే మీ పనులు చేసి పెడతానన్నారు. ఎవరైనా నేరుగా రావచ్చని..వెంటనే మీ సమస్య పరిష్కరిస్తానని భరోసానిచ్చారు.
మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయించండి సార్ ...
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూర్ మండల కేంద్రంలో పర్యటి స్తుండగా గ్రామపంచాయతీ ఉద్యోగులు ఒకేసారి ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మా ఉ ద్యోగాలను రెగ్యులరైజ్ చేయించి భద్రత కల్పించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చే యాలని ఎమ్మెల్యేకు పంచాయతీ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎ మ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానని పంచాయతీ కార్మికులకు భరోసనిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు కోఆర్డినేటర్ ఎన్కతాళ్ళ రవీందర్,పార్టీ మండల అధ్య క్షులు లేతాకుల సంజీవరెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భగవాన్ రెడ్డి, ఎంపీపీ మార్క సుమలత రజినీకర్,వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి,ఉపసర్పంచ్ స్వాతి,గ్రామ అధ్యక్షులు పాపనిరవీందర్,బొల్లోజు కుమారస్వామి,జిల్లా నాయకులు కక్కెర్ల రాజు, బొమ్మగాని రవి గౌడ్,కంతాల కేశవరెడ్డి,దళిత బంధు కోఆర్డినేటర్ నత్తి సుధాకర్, పాక్స్ చైర్మన్ అంబాటి రాజస్వామి,పెరుమాండ్ల బిక్షపతి, రేవూరి ప్రవీణ్ రెడ్డి, భాష బోయిన సదానందం,పొగాకుల సంతోష్,పైడి తదితర నాయకులు పాల్గొన్నారు.