Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ-ఖానాపురం
మండల పరిధిలోని ధర్మరావుపేట గ్రామ శివారులో అనుమతులు లేకుం డా నిర్మాణాలు చేస్తున్న ఫంక్షన్‌హాల్‌పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకో వాలని నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురణనైన 'అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి' అనే కథనానికి నర్సంపేట డివిజనల్ పంచాయతీ అధికారి వెంక టేశ్వర్లు స్పందించి బుధవారం ధర్మరావుపేటలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌ని సందర్శించారు. గ్రామపంచాయతీ నుండి అనుమతులు పొంద కుండా నిర్మాణం కొనసాగించడంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్య క్తం చేశారు. గ్రామంలో నూతన నిర్మాణాలకు గ్రామపంచాయతీ అనుమతి తప్ప నిసరి అని, అనుమతి లేకుండా నిర్మిస్తే చట్టపైన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. అనుమతి లేని నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలని పంచాయతీ కార్యదర్శుని ఆదేశించగా, ఫంక్షన్హాల్లో నిర్మించిన గదిగోడలను డోజర్‌తో పం చాయతీ కార్యదర్శి సమక్షంలో కూల్చివేశారు.డివిజనల్ పంచాయతీ అధికారి వెం ట ఎంపీవో పసరగొండ రవి, సర్పంచ్ వెన్ను శృతిపూర్ణచందర్, కారోబార్ రాము లు, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.