Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్న చేనేత వస్త్రాల విక్రయాలకు టెస్కో, ఆప్కో షాపులు ప్రారంభానికి నోచుకోలేదని, ప్రభుత్వ అనుమతితో షాపింగ్‌మాల్స్ మాత్రంపుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తు న్నాయని, చేనేత రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చే స్తుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్య క్షులు దాసు సురేష్ విమర్శించారు. మండల కేంద్రం లోని చేనేత సొసైటీని బుధవారం ఆయన సందర్శిం చి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం వనం దేవరాజ్ అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు సరై న జీవనోపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోచంపల్లిలో ఎన్నికల ముం దు కేసీఆర్ జోల పట్టుకొని తెలంగాణ వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండవని చెప్పారని 9 ఏళ్లు గడుస్తున్నా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదని స్ప ష్టం చేశారు. షాపింగ్ మాల్స్ లో పవర్లూమ్ వస్త్రా లను కూడా చేనేత వస్త్రాలని ప్రజలను మోసం చేస్తు న్నారని, ఇదేవిషయమై ఇటీవల వరంగల్ పట్టణం లోని కాసం షోరూమ్‌లో న కిలీ చేనేత వస్త్రాలను, పో చంపల్లి హ్యాండ్లూమ్ వ స్త్రాలని విక్రయిస్తుండడం తో రెడ్‌హ్యాండెడ్ గా పట్టు కొని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవ డంతో, ఢిల్లీ పీఎం ఆఫీసు లో, చేనేత జౌళి శాఖ కమి షనర్ కార్యాలయంలో, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలిపారు. కార్పొరేట్ శక్తులు చేనేతకార్మికుల శ్రమ దోపిడిని గురి చేస్తున్నా రని అన్నారు.
చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో డి మాండ్ ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ఈనెల 5న వ రంగల్ పర్యటించనున్నారని, చేనేత వస్త్రాలపై స్ప ష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కూలీరేట్లను రెండింతలు చేసి, సొసైటీకి రూ.10లక్షల రుణాలు అందజేసి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కులస్తులందరూ సంఘటితమై బలమైన వ్యవస్థ నిర్మాణానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ స భ్యులు దాసు నరేష్, గాజు యుగంధర్ యాదవ్, సొ సైటీ డైరెక్టర్ దాసరి సమ్మయ్య, మాజీ సర్పంచ్ చంద్ర మౌళి, సీపీఐ జిల్లా నాయకులు వంగరి సాంబయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.