Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
అకాలవర్షాలకు తడిసి ము ద్దయిన ధాన్యాన్ని, ఎలాంటి కో తలు విధించకుండా ప్రభు త్వం తక్షణమే కొనుగోలు చేసి రైతాం గానికి మద్దతు ధర చెల్లించాల ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్రకన్వీనర్ మోర్తాల చందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని దామెర ఐకెపి సెంటర్ కొను గోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం తమ ప్రతినిధులతో కలిసి సందర్శించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలుదారులు తమ ధాన్యాన్ని తూకం వేసుకోకుండానే, తక్షీట్ ఇవ్వ కుండానే గన్నీ సంచులు మాత్రమే, ఇచ్చి రైతులని నేరుగా రైస్ మిల్లు వద్దకు తీసు కెళ్లి, యజమానికి తూకంతో అప్పగించాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మిల్లరు క్వింటాకు10కేజీల చొప్పున తడిసిన ధాన్యానికైనా, తడవని ధాన్యాని కైనా, ఒకేరీతిలో తరుగుదల పేరుతో తూకం తగ్గించి తీస్తున్నారని, దీనివలన క్విం టాల్కు రూ.250లతో పాటు, రవాణా చార్జీలు, హమాలీ ఇతర చార్జీలతో సహా రైతులే నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. దీనిపై వ్యవసాయ మార్కెట్లలో పం టలు విక్రయించుకునే రైతులను దళారులు మోసం చేస్తున్నారని ఆ దళారుల మోసాల బెడద నుండి రక్షించేందుకే ప్రభుత్వం ఏ ఊర్లో పండించుకున్న రైతుల ధాన్యాన్ని అదేఊర్లో ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఎలాంటి ఖర్చులు లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేష్ నాయక్, నా యకులు రాజు ,మహేందర్, రైతు నాయకులు సాంబరాజు, సురేష్, రాకేష్, రాజు, పెద్దరాజు, తదితరులు పాల్గొన్నారు.