Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, నిరు పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని రా ష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినరుభాస్కర్ అన్నారు. ని యోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలోని 56 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం స హాయనిధి ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధ వారం కాజీపేట మున్సిప ల్ కార్యాలయంనందు ని ర్వహించగా ముఖ్య అ తిథి గా చీఫ్‌విప్ వినరు భా స్కర్ హాజరై చెక్కులు పం పిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క ళ్యాణ లక్ష్మీ ద్వారా నిరుపే ద ఆడపిల్లల వివాహాలకు ఒక్కొక్కరికి లక్ష పదహారు రూపాయల చొప్పున 31లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని. కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డపెళ్లికి ఒక మేన మామ అందించిన ఒక గొప్ప కానుకగా ప్రజలు భావి స్తున్నారన్నారు.
లక్షలాది మంది అడబిడ్డలకు ఒక గొప్పవరంగా కళ్యాణ లక్ష్మి పథకం మారిందనన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ పథకాలు ఆర్ధికంగా వెనుకబడిన ప లు కుటుంబాలకుఆర్థిక చేయూతనంది స్తుంద న్నా రు. 2014 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా క ళ్యా లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా 10 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిచ్చిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్థానిక నాయకుల ద్వారా వారి స్థితిగతులను తెలపడంతో తక్షణమే స్పందించి బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆ ర్థిక భరోసాను కల్పించడం జరిగిందన్నారు. 26 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువగల చెక్కుల ను అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంకు నర్సింగ్, చెన్నం మధు, సోదాకిరణ్, ఎలుకంటి రాములు, రైతుబంధు సమితి అధ్యక్షుడు కృష్ణ, టీఆర్ఎస్ కార్పొ రేటర్ అభ్యర్థి సుంచు అశోక్, డివిజన్ అధ్యక్షులు రం జిత్, శివ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిట్టల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.