Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేటలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎంపీఓ పి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో కొద్ది రోజు లుగా డెంగ్యూ, విష, వైరల్ జ్వరాలు ప్రబలు తుండడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. వైద్య శిబిరంలో మంగ పేట, బ్రాహ్మణపల్లి ప్రభుత్వ వైద్యులు అల్లి నరేష్, కారం నిఖిల్ కుమార్, ఎసీహెచ్ మొబైల్ టీమ్ వైద్యాధికారి డాక్టర్ నాగ అనీష్ వైద్యాధికారులతో పాటు 12 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని వీధులలో పర్యటించి పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్, ఫాగింగ్, లార్వా స్ప్రేయింగ్ చేయించి సుమారు 35 మందికి మందికి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. జ్వరంతో బాదపడుతున్న సుమారు వంద మంది నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్యం వల్ల మృతి చెందిన వారి కుటుంబ సభ్యలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసినట్లు వైధ్యాధికారులు తెలిపారు. వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ కోరం క్రాంతి కుమార్, జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీం దుర్గారావు, మండల ప్రత్యేక అధికారి తుల రవిలు సందర్శించినట్లు ఎంపీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎల్టీ లలితారాణి, రాంబాబు, సీహెచ్ఓ సత్యవతి, హెచ్ఈఓ అబ్బాస్, హెచ్వీ గంగమ్మ, ఏఎన్ఎం లలిత, రమాదేవి, ఆశలు పాల్గొన్నారు.