Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తపల్లిలో అర్ధరాత్రుల్లోనూ అక్రమ తవ్వకాలు
- స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే...?
- అడ్డుకున్న వార్డు సభ్యులు, గ్రామస్థులు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడు తూ అక్రమార్కులు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మొ రం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ భూమి చదును పేరుతో మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారు అనుముల ఏనే సమీపం లో ఓ రైతు వ్యవసాయ భూమి చదును చేసుకోవాలని గ్రామ పంచాయితీ కార్యాలయంలో వార్డు సభ్యుల తీర్మానంతో తమ అనుమతి లేదంటూనే, తన భూమిలో చదును చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. ఇదే అద నుగా పంచాయితీ కార్యాలయ అనుమతి ఉందనే కాబోలు... స్థానిక ప్రజా ప్రతినిధి ఏకంగా మొరం దందానే మొదలు పెట్టాడు. ఇలా గత కొద్ది రోజు లుగా మొరం దందా సాఫీగా సాగిపోతుంది. ఆలస్యంగా గమినించిన గ్రా మస్థులు, వార్డు సభ్యులు కలిసి మొరం తరలిస్తున్న టిప్పర్లను శనివారం అడ్డుకున్నారు. భూమి చదును చేసినట్లే చేసి, పక్కనే గల అనుముల ఏనేకు జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి, టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు రాత్రంతా క్రమక్రమంగా మట్టిని తోడేస్తూ ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే....
నాలుగు రోజుల క్రితం డబల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ విషయంలో గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. అది మరవక ముందే ఇంతలోనే భూమి చదును పేరిట మొరం అక్రమ తవ్వకాలు కూడా ఆ స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తుందని గ్రామస్థుల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అసైన్డ్ భూముల్లో మొరం తీయాలంటే రెవెన్యూ అధికారులు, మై నింగ్శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కా నీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చదును పేరుతో తవ్వకాలు చేపట్టి, మొరంను కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి అక్రమ మొరం తరలింపు భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులంతా డిమాండ్ చేస్తున్నారు.
అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్ పూల్ సింగ్
మట్టిగుట్ట (ఏనే), అసైన్డ్ భూములు, చెరువు శిఖంల నుంచి మొరం తీయడం చట్టరీత్యా నేరం. కొత్తపల్లి శివారులో నుంచి మొరం తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా తరలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.