Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్, సహకార శాఖ వారి సౌజన్యం తో పీఏసీఎస్ ధన్నసరి సోసైటి ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మహబూబాబాద్ ఎమ్మేల్యే శంకర్ నాయక్, హకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, హాకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఆ రైతులను రాజును చేయడమే కేసిఆర్ లక్ష్యమని వారు అన్నారు. తెలంగాణ రా ష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని పండగల చేసుకునేలా కేసీఆర్ సహకారంతో రైతుకు మద్దతు ధరతోపాటు సబ్సిడీలు ఇన్సూరెన్స్‌లు రైతుకు సౌకర్యార్థం కోసమే కెసిఆర్ చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఎంపిపి ఓలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరంజిల్లా అధ్య క్షుడు మాదారపు సత్యనారాయణరావు, మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, పీఏసీఎస్ ధన్నసరి చైర్మన్ మర్రి నారాయణరావు, ఆత్మ చైర్మన్ పోలేపల్లి నెహ్రూ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి చత్రు నాయక్, స్థానిక సర్పంచ్ బట్టు శ్రీను, రైతు బందు సమితి మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు కూన భద్రాద్రి, జాటోత్ హరీష్ నాయక్, గౌండ్లయాదగిరి, అనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి, ఓలంమురళి, ఎంపిటిసి లు సట్ల వెంకన్న, అగే మంజుల వెంకన్న, మండల వ్యవసాయాధికారి వెంకన్న, ఇంఛార్జి తహాశీల్డార్ పులి సాంబ శివుడు, ఎంపిడిఓ రవీంద్ర రావు, మండల బిఆర్ ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ అహ్మద్, కార్యదర్శి కముటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.