Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
అత్యంత వైభవోపేతంగా రెండవ రోజు పసర పంచాయతీ రాంపూర్ గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన మహౌత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన వేద పారాయణం గణపతి పూజ వర్ష పూజ మూల మంత్ర గ్రామోత్సవ బలిహరణ కార్యక్రమాలను 10 మంది రుత్వికు లు వేద మంత్రోచ్ఛారణల మధ్య నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించారు. అనంతరం సుమారు 200 మంది జంట దంపతులతో లక్ష్మీదేవి పూజలను పు ష్పల ఆవాస పూజలను హౌమాలను నిర్వహించారు. అనంతరం డీజే సౌండ్ల మధ్య కోలాట నత్యాల మధ్య శ్రీదేవి భూదేవి బొడ్రాయి రాంపూర్ గ్రామ శోభా యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అనురాధ నక్ష త్ర యుక్త వషభ లగ పుష్కరాంశ సుముహూర్తంన బొడ్రాయి ప్రతిష్టాపన కార్య క్రమాన్ని నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. బొడ్రాయి ప్రతిష్టాపన లో అతి ముఖ్యమైన ఘట్టం మధ్యాహ్నం 3నుండి సాయంత్రం 6 గంటల వరకు అష్టదిగ్బంధనం కార్యక్రమం ఉంటుందని గ్రామస్తులు ఎవరు బయటకు వెళ్లకుం డా, బయట వారెవరు లోపలికి రాకుండా దారులు నిలిపివేసి దిగ్బంధనం చేయ డం జరుగుతుందని దీనిని ఎంతో నియమ నిష్ఠలతో పాటించాలన్నారు. ఈ సమ యంలోనే రాంపూర్ గ్రామ పొలిమేరల చుట్టూ బలి చల్లడం జరుగుతుందన్నారు. సాయంత్రం వేళ గ్రామస్తులందరూ ప్రతి ఇంటి నుండి ముత్యాలమ్మ అమ్మవారికి బోనములు సమర్పించాలని. సోమవారం వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించ డంతో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం సంపూర్ణం అవుతుందని తెలిపారు.