Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలో నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు, సిబ్బందికి విద్యుత్ భద్రత, పొదుపు సూచన కార్య క్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర హకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్ మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ శాఖ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారుల కు భద్రత పరికరాలను ఎమ్మేల్యే శంకర్ నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కేసముద్రం మండల ఎంపిపి ఓలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్య నారాయణ రావు, మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, ఆత్మ చైర్మన్ పోలేపల్లి నెహ్రూ రెడ్డి, స్థానిక సర్పంచ్ బట్టు శ్రీను, రైతు బందు సమితి మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.