Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
ధాన్యం సేకరణ వేగ వంతంగా చేయాలని తొర్రూ రు ఆర్డీవో రమేష్ అన్నారు. శనివారం మండల కేంద్రం లోని ఐకేపీ, పీఏసీఎస్ కొ నుగోలు కేంద్రాలను తహశీ ల్దార్ రమేష్ బాబుతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సెంటర్ల లోని ధాన్యం సేకరణ రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం, ఎఫ్ఏక్యూ టెస్ట్ పూర్తి కాగానే వెంటనే మిల్లర్లకు తరలించాలన్నారు. రైతులు ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి రైతులు గరిష్ట మద్దతు ధర పొందాలన్నారు. రై తులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోస పోవద్దని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ భూక్య లష్కర్, సెంటర్ ఇంఛార్జి దండె రఘుపతి, రైతులు పాల్గొన్నారు.