Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
బ్రహ్మౌత్సవాల్లో భాగంగా శనివారం నడకదారి లోని షికాంజనేయస్వామికి పంచామతాలతో అబిషేకం నిర్వహించి స్నపనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు యాజ్ఞికులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలోని అ ష్టకా శ్రీవైష్ణవాన్ రుత్వికులు చతుస్థానార్చన, మహా నివేదన కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించా రు. స్వామి కళ్యాణం తెల్లవారి జరిగే రథోత్సవం కార్య క్రమంలో బాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహా లకు యాగశాలలో షాతుమురై బాలబోగం, శతుస్థా నార్చన, మహానివేదన, బలిహరణ నిత్యశాంతిహౌ మాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం రథో త్సవం సాయంత్రం 5 గంటలకు ఆలయ తిరువీధు ల్లో ఊరేగించి అక్కడ నుండి మల్లూరు గ్రామంలో ర థోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇవో శ్రవణం సత్యనారాయణ, ఆలయ ప్ర ధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కా మల రాజశేఖర శర్మ, రుత్వికులు ధనమోహనా చార్యు లు, వెంకటనారాయణశర్మ, రాజీవ్ నాగ శర్మ, పవన్ కుమారాచార్యులు,ఈశ్వరచంద్ రామానుజ, సిబ్బంది సీతారాములు, సుధీర్, గణేష్, అజరు, నవీన్, నాగా ర్జున, పుల్లయ్య, నాగేశ్వరరావు, నర్సింహారావు, లాల య్య, బోయీలు పాల్గొన్నారు.
మొక్కులు చెల్లించిన భక్తులు
స్వామి అమ్మవార్ల కల్యాణంలో మరుసటి రోజు శనివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఇలవేల్పుగా కొలుచుకునే హేమాచల లక్ష్మీనర్సింహా స్వామికి తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు న గదు, బంగారు, వెండి ఆభరణాలు కోడె మొక్కులను, కానుకలు సమర్పించుకున్నారు. మరి కొందరు భక్తు లు నిలువు దొపిడీ పేరుతో తమ ఒంటిపై ఉన్న వస్తు వులను స్వామికి సమర్పించిమొక్కులు తీర్చుకున్నారు.
తిమ్మంపేట గ్రామస్తుల మహాఅన్నదానం
బ్రహ్మౌత్సవాల్లో శనివారం హేమాచలం సంద ర్శించుకున్న భక్తులకు మండలంలోని తిమ్మంపేటకు గ్రామస్తులు మమా అన్నదానం నిర్వహించినట్లు ని ర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. సుమారు 5 వేల మందికి పైగా హాజరైన భక్తులకు మహాఅన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువ కులు, మహిళలు పాల్గొన్నారు.