Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచి హత్యాయత్నం చేస్తారా?
- విలేకరుల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు ఫైర్
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచి హత్యాయత్నం చేస్తారా? అన్యాయానికి గురైన పేద ప్రజల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాటాలు చేస్తే చంపేస్తారా..? అని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అధికార పార్టీ నాయకుల పై మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ తో కలిసి ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టేకుమట్ల మండలం రామకష్ణాపూర్ (టి) గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో మాలలకు చెందిన ఇండ్ల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు టేకుమట్ల మాజీ ఎంపీపీ దంపతులపై మా మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఇతర ముఖ్య నాయకులు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. కాలనీ వాసులకు న్యాయం జరగాలని వాళ్ల భూమి వాళ్ళకే తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని మాజీ ఎంపీపీ బందెల స్నేహలత - నర్సయ్య దంపతులపై పోరాటం చేస్తుంటే, రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఉదయం టేకుమట్ల పోలీస్ స్టేషన్ లో చంపడానికి యత్నం చేశారని అన్నారు.
కాంప్రమైజ్ పేరుతో ఇరువురిని టేకుమట్ల పోలీస్ స్టేషన్ కి పిలిపించి స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఎస్సై, పోలీస్ సిబ్బంది దగ్గరుండి దాడి చేయించడం మంచి పద్దతి కాదన్నారు. మండలంలో దోషులుగా నిలబడాల్సి వస్తుందనే ఇలాంటి భౌతిక దాడులకు దిగి, బైక్ అడ్డగించి బందెల నరేష్ - స్నేహలత తో పాటు కొంతమంది సతీష్ బైక్ ను ఆపి రోడ్డుపై పడేసి గొంతుపై కాలేసి తొక్కుతూ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, అడ్డొచ్చిన వాళ్ల మీద అక్రమ కేసుల్లో ఇరికిస్తారా అని అన్నారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి వాట్సాప్ చేసినట్లు జీఎస్సార్ తెలిపారు. తక్షణమే విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో టీపిసిసి సభ్యులు చల్లూరి మధు, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, ముఖ్య నాయకులు పిప్పాల రాజేందర్, వెంకన్న, గురిజాల రవి లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ఐకేపి వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి..
కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న ఐకేపి వీవోఏలకు గండ్ర సత్యనారాయణ రావు, దుద్దిళ్ళ శ్రీనుబాబు, అయిత ప్రకాష్ రెడ్డి లు మద్దతు.. ఐకేపి వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి, వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు, డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి లు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వారి దీక్షకు గండ్ర సత్యనారాయణ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అయిత ప్రకాష్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవీఓఏ లు సమ్మె చేయడానికి ప్రభుత్వమే కారణమన్నారు. వీఓఏల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే అధికారులకు, ప్రభుత్వం కు విన్నవించినా, స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ సర్వేలు, అనేక పనులు చేస్తూ ప్రజలకు బ్యాంకులకు మధ్య వారధిగా ఉంటూ కోట్ల రూపాయలు ప్రజలకు బ్యాంకుల నుంచి ఇప్పిస్తూ తిరిగి రికవరీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించపోవడం దారుణమన్నారు. ఇంతలా కష్టపడి పని చేస్తున్న వివోఎల జీతాలు పెంచకపోవడం దుర్మార్గమని వారన్నారు. వివోఏలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని వివోఏలను సేర్ఫ్ ఉద్యోగుల గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వీవోఏలను అరెస్టు చేయడం సరికాదన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి సభ్యులు చల్లూరి మధు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుగుణ, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వప్న, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువన సుందర్, తోట రంజిత్, చరణ్ లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.