Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫక్షన్ హాల్ లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్మికుల ఆత్మీయ సంబురాల కార్య క్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో భవనాన్ని నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే శంకు స్థాపన చేయడం జరుగుతుందన్నారు. కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తుందన్నారు. సాధారణ మరణం పొందిన కార్మిక దీని కుటుంబానికి రూ. 2లక్షలు, గుర్తింపు పొందిన కార్మికుని వివాహ ఖర్చులకు రూ.30వేలు అందిస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకోసం ప్రభుత్వం ఆరోగ్య కార్డులను అందిస్తు ందన్నారు. ప్రతి ఒక కార్మికుడు గుర్తింపు కార్డును తీసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనుంచి ములుగు జిల్లా అయ్యి విడిపోయాక. కార్మికశాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ కార్యాలయాలు అక్కడే ఉన్నాయని ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. త్వరలోనే వాటిని భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కషిచేస్తామన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2లక్షల చెక్కును అందజేశారు. నూతనంగా కార్మికులుగా గుర్తింపు పొందిన వారికి హెల్త్ కార్డులను అందజేశారు. అనంతరం భూపాలపల్లి జిల్లా నుంచి ఉత్తమ కార్మికులుగా ఎన్నికైన నర్సింగారావు, రమేష్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 34వేలకు పైగా ఉన్న కార్మికులు, కార్మికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక ఆత్మీయ సమ్మేళనానికి 150 మంది కార్మికులు హాజరు కాకపోవడం పలు విమర్శలకు దారితీసింది. సీఎస్సీ ఆధ్వర్యంలో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 101 మంది కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె పరీక్షలు, ఊపిరి తిత్తుల పరీక్ష చెవిటి, మూగ వారికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు మౌనిక, హారిక, అసిస్టెంట్ లేబర్ అధికారి వినోద, క్యాంపు కోఆర్డినేటర్ బీరెల్లి శశిధర్, జిల్లా కోఆర్డినేటర్ రవితేజ, తదితరులు పాల్గొన్నారు.