Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో భాగంగా కూలీలు కొలతల ప్రకారం పనులు చేస్తే రోజు కూలి రూ.272 వస్తోందని ఉపాధిహామీ ఏపీఓ హరీష్ చెప్పారు. గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఏపీఓ సిబ్బందితో కలిసి నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో కూలీలు చేస్తున్న పని ప్రదేశాలను పర్యవేక్షణ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలు ముఖ్యంగా చెరువు పూడికతీత, ఖండింత కందకాలు,అడవుల్లో బంటాలు పనులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో మొత్తం కూలీలు 2,982 మంది పనులకు వెల్లుతున్నారని చెప్పారు. కూలీలకు రోజు ప్రభుత్వం అందించే రూ.272 కూలి రావాలంటే ప్రతి కూలి కొలతలు ప్రకారం పని చేయాలని తగు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టెక్నీకల్ రేగా శేఖర్, పిల్డ్ అసిస్టెంట్లు దరావత్ దేవేందర్, బానోతు కిరణ్,కూలీలు పాల్గొన్నారు.