Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి చూపుతున్న ప్రభుత్వం
- చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివద్ధి మత్స్యకారుల కు ఉపాధి చూపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జలాశయాల్లో 2కోట్ల 92లక్షల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 833 చెరువులు,4 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి మత్స్యశాఖ ప్రణాళికతో సిద్దంగా ఉన్నది. జిల్లా వారిగా టెండర్ ప్రక్రియ మొదలగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ రెండు నెలలో పుర్తిగావించుకొని చేప పిల్లల సరఫరాను మొదలుపెట్టనున్నారు.
జిల్లాలో 107 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 9,085 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక భాగంగా 12 నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘలు మరియు 64 మత్స్య పారిశ్రామిక సహకార సంఘల నుండి 1,836 నూతన సభ్యత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్యారా చెయ్యడం జరుగుతుంది.అందులో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో నూతన సంఘం కోసం మరియు నూతన సభ్యత్వాల కోసం వతి నైపుణ్య పరిక్ష మత్స్యకారులకు పెట్టడం జరిగింది, ఇప్పటి వరకు మొత్తం11నూతన సంఘాలకు గాను 318 మంది వత్తి నైపుణ్య పరిక్షలో ఉత్తిర్ణత సాధించడం జరిగింది. అలాగే నూతన సభ్యత్వాల కోసం 47 సంఘాలకు గాను వత్తి నైపుణ్య పరిక్ష పెట్టగ 1,317 మంది సభ్యులు ఉత్తిర్ణత సాధించడం జరిగింది. మరియు వారి యొక్క నమోదు ప్రక్రియ పురోగతిలో ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యకారుల సామూహిక బీమాపథకం 2021-22 సంవత్సరము నుండి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణించిన సందర్బములో రూ.5లక్షల రూపాయలను మరణించిన మత్స్యకారుల చట్టపరమైన వారసులకు ఇవ్వడము జరుగును. ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన యెడల రూ. 2.50 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరమునకు గాను మన భూపాలపల్లి జిల్లాలో (8,731) మత్స్యకారుల జాబితా బీమా పథకంనకు పంపించబడినది. జిల్లాలో ఇప్పటి వరకు (14) ధరఖాస్తులు పంపించగా, దానిలో (7) ధరఖాస్తుదారులకు రూ.5 లక్షల చొప్పున రూ.35 లక్షల రూపాయలు నామీని ఖాతాలో జమ చెయ్యడం జరిగింది, మిగిత (7) ధరఖాస్తులు పురోగతిలో ఉన్నవి.
నూతనంగా సభ్యత్వం పొందే మత్స్యకారులకు కూడా
2017 లో సమగ్ర మత్స్యఅభివద్ధి పథకం ద్వారా సభ్యత్వం కలిగిన మత్స్య కారులు వివిద లాభ సాటి అయిన పధకాలు వారు పొందినారు. అందులో 75% సబ్సిడీతో అనేక రకాల యూనిట్లను పంపిణీ చేసింది. ఇందులోద్విచక్ర వాహనాలు 1,268 , వలలు 166, క్రేట్లు 91, లగేజీ ఆటోలు 69 , మొబైల్ షిప్ అవుట్లెట్లు 23, హైజెనిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు 6, ఇన్సులేటెడ్ ట్రక్కు 1 మొదలగునవి అందజేయడం జరిగింది. ఈలాంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపుతూ వారి ఆర్థిక పురోగతికి బంగారు బాటలు వేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్థిక పురోగతికి బంగారుబాటలు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మత్స్య శాఖలో పధకాలు :
పథకంలో భాగంగా చేపల చెరువుల నిర్మాణం (యూనిట్ విలువ -11 లక్షలు),చేప విత్తనాల హేచరీస్ నిర్మాణం(యూనిట్ విలువ -25 లక్షలు), రిసర్క్యూలేటర్ ఆక్వాకల్చర్ యూనిట్(యూనిట్ విలువ -50 లక్షలు), కేజీ కల్చర్(యూనిట్ విలువ -3 లక్షలు), ఇన్సులేటెడ్ వాహనం (యూనిట్ విలువ -20 లక్షలు), త్రి చక్ర వాహనం (యూనిట్ విలువ -3 లక్షలు), చేపల దాణ మిల్లు నిర్మాణం (యూనిట్ విలువ -30 లక్షలు), సంచార మత్స్య విక్రయ కేంద్రం (యూనిట్ విలువ -10 లక్షలు), చేప విత్తన పెంపక చెరువులు (యూనిట్ విలువ -7.5 లక్షలు), లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్(యూనిట్ విలువ -20 లక్షలు).
2020-21 గాను 60.90 %నa% చేపల చెరువులగాను 18.70 నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. ఇట్టి చెరువులకు గాను సబ్సిడీ నిమిత్తం కమీషనర్ గారి కార్యాలయానికి సమర్పించబడినది.2022-23 సంవత్సరమునకు గాను కొత్త చేపల చెరువుల నిర్మాణనికి 83 ధరఖాస్తులు (96.0) స్వీకరించడం జరిగింది. జిల్లా స్థాయి కమిటి తో ధరఖాస్తుదారుల భూపరిశీలన ద్వార 63 మంది దరఖాస్తుదారులకు అనుమతి మంజూరు అయ్యింది..
అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలి
అవినాష్ జిల్లా మత్స్యశాఖ అధికారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జిల్లాలోని మత్స్యకారుల సంఘం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి అవినాష్ సూచించారు.సొంత ఖర్చులతో ఎవరు చేప పిల్లలను చెరువులలో కుంటలలో పోయకూడదని సూచించారు. సంఘాలు ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు కుంటలలో చేప పిల్లలు అవసరమైతే మచ్చ సహకార సంఘం ద్వారా జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు .