Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊహగానాలకు తెర
- జిల్లా కార్యవర్గం నియామకం ఎన్నడో ....
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించినా ఇప్పటి వరకు పా ర్టీకి కేవలం అధ్యక్షుడిగా ఛీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ను మాత్రమే నాయక త్వం నియమించింది. జిల్లా కార్యవర్గాన్ని నేటికీ నియమించకపోవడం గమనార్హం. అధ్యక్షుడిని నియమించి ఏడాది పూర్తయినా, కార్యవర్గాన్ని మాత్రం నేటికీ ఖరారు చేయలేదు. ఇప్పటికైనా పార్టీ జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తారా? లేదా ? అన్న సం దేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం బిఆర్ఎస్ బహిరంగసభలో 'దాస్యం'ను వచ్చే ఎన్నికల్లో 70వేల మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో 'దాస్యం' సేఫ్ జోన్లో వు న్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుండి పలువురు కీలక నేతలు పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు వచ్చిన ప్రచారానికి తెరపడింది.
వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, ఛీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్ను వచ్చే ఎన్నికల్లో 70 వేల మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో 'దాస్యం'కు పార్టీ టికెట్ పక్కా అయ్యిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల 'పశ్చిమ'లో బిఆర్ఎస్పార్టీ టికెట్ కోసం కీలక నేతలు తీవ్రంగా ప్రయత్ని స్తున్నారని జరుగుతున్న ప్రచారానికి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఫుల్స్టాప్ పడ్డ ట్టయ్యింది. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా 'దాస్యం' నియామకం జరిగిన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల మండలాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయలేదు. శుక్రవారం ఈ మేరకు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం, పార్టీ అధ్యక్షుడిగా దాస్యం వినరుభాస్కర్ను అధ్యక్షుడి కుర్చీలో మంత్రి కేటీఆర్ కూర్చోపెట్టిన నేపథ్యంలో 'దాస్యం' ఇక నుండి జిల్లాలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు 'దాస్యం' అనుచరుల్లో సంతోషాన్ని నింపాయి. ఇదిలావుంటే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న బిఆర్ఎస్లోని పలువురు కీలక నేతలు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పూర్తిగా నగరంలో వున్న నియోజకవర్గం, ఇక్కడ బహిరంగసభను నగరవాసులతో జయప్రదం చేయాలంటే మామూలు వ్యవహారం కాదు. ఇది వినరుకు ముందు నుండి కత్తి మీద సాములాగానే మారింది. మంత్రి కేటీఆర్ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. పర్యటన ఆలస్యం కావడంతో బహిరంగసభకు వచ్చిన ప్రజలను మంత్రి కేటీఆర్ మాట్లాడే వరకు కూర్చోపెట్టడం పార్టీ శ్రేణులకు కష్టసాధ్యంగా పరిణమించింది. ఈ క్రమంలో సభ ఆలస్యమవుతుండడంతో సభకు విచ్చేసిన నగరవాసులు చాలా మంది వెనుతిరగడం కనిపించింది.
అధ్యక్షుడు సరే.. మరి కార్యవర్గం ఎప్పుడో..
బిఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ను నియమించిన పార్టీ నాయకత్వం జిల్లా కార్యవర్గాన్ని నేటికీ నియమించకపోవడం గమనార్హం. హన్మకొండ జిల్లా పార్టీని ప్రారంభించినా, కార్యవర్గం లేకపోవడంతో అన్నీ అధ్యక్షుడే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధ్యక్షులను నియమించి ఏడాది పూర్తయినా, నేటికీ పార్టీ కార్యవర్గాలను నియమించకపోవడం పార్టీ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలపడలేదు. పార్టీ నిర్మాణంపై ముందు నుండి బిఆర్ఎస్ నాయకత్వం శ్రద్ధ కనపరచకపోవడం గమనార్హం. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలే అన్నీ తామై వ్యవహరించడం బిఆర్ఎస్లో పరిపాటిగా మారింది. పార్టీ జిల్లా కార్యాలయాలు సైతం ప్రారంభించుకుంటున్న ఈ తరుణంలో జిల్లా పార్టీ కార్యవర్గాలనైనా నియమిస్తారో, లేదోనన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతోపాటు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాలకు చెందిన మండలాలున్నాయి. బిఆర్ఎస్కు ప్రస్తుతం మండలపార్టీ నిర్మాణం కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నా పార్టీని సంస్థాగతంగా నిర్మించకపోవడం పార్టీ నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే వున్నందునా వెంటనే జిల్లా పార్టీ కార్యవర్గాలతోపాటు, మండల పార్టీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.