Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ప్రస్తుతం పిల్లలు సమయం దొరికిందంటే సెల్ ఫోన్లో ఆటలలో నిమగమవుతుంటారు. ఎక్కువగా పిల్లలు ఫ్రీ ఫైర్,పబ్జి, లుడో ఆడుతూ అదేవిధంగా ఫే స్‌బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్‌లో చూ స్తూ కొంతమంది ఉంటే మరి కొంతమంది షార్ట్ వీడి యోస్ చేస్తూ మానసికంగా ఒత్తిళ్లకు గురై అనా రోగ్య బారిన పిల్లలు లేకపోలేదు. గతంలో కొన్ని దశా బ్దాల క్రితం వేసవికాలంలో చిర్రగోని తొక్కుడు బిల్ల, వంటి పలు రకాల క్రీడలు ఉండేవి కానీ నేటి పరిస్థి తుల్లో అలాంటి ఆటలు ఆడేవారు చాలా తక్కువ అందువ ల్ల సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపేవారు వివిధ అనారోగ్యనికి గురవుతున్నారని సమాచారం. అందు వల్ల నేటి పరిస్థితుల్లో పిల్లలు ఆటలపై మక్కువ పెంచే దిశగా వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్ర ధాన కార్యాలయం సమీపంలోని ఇండోర్ స్టేడియం లో నైపుణ్యం గల కోచ్‌లతో ప్రతిరోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పిల్ల లకు ఉచితంగా షటిల్, జూడో, చెస్, క్యారం, టెన్నిస్, యోగ వంటి క్రీడలలో ఉన్నత శిఖరాలను అధిరో హించుటకు మెలకువలను నేర్పుతున్నారు. హైదరా బాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో మేయ ర్ గుండు సుధారాణి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉద యం, సాయంత్రం పిల్లలకు గుడ్లు, అరటిపండ్లు, బి స్కెట్లు వంటి అల్పాహారం ఇస్తూ ఉచిత శిక్షణ శిబిరా లు నిర్వహించడం గమనర్హం. వేసవి కాలంలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలకు హనుమకొండ లేబర్‌కాలనీ రంగసాయిపేట నుండి సుమారుగా 200 మంది పిల్లలతో ఇండోర్ స్టేడియం కళకళలాడుతుంది. పిల్ల లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆటలు ఆడుతూ శారీర కంగా మానసికంగా పురోగతి సాధిస్తున్నామని పలు వురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొర్రూరు:18 సంవత్సరాలలోపు బాల, బాలికల కు తొర్రూరు యతిరేజరావు పార్క్‌లో వాలీబాల్, షటి ల్ బ్యాట్మెంటన్, కరాటే, అథ్లెటిక్స్ క్రీడల్లో ఉచిత వేస వి శిక్షణ శిబిరం ఈనెల 8 నుండి 31 వరకు ఏర్పాటు చేసినట్లు శిబిరం ఇన్చార్జ్ బిక్షపతి ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. స్థానిక యతిరాజారావు స్మారక చి ల్డ్రన్స్పార్క్ ఆవరణలో ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల వరకు సాయంత్రం 4:30 నుండి 6 వర కు ఆయా ఆటల్లో ఉచితంగా అనుభవజ్ఞులు అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులతో నెల రోజుల పాటు వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రీడాకారు లకు శిబిరంలో ఆట దుస్తులు, కలెక్టర్ జారీచేసే స మ్మర్ క్యాంప్ సర్టిఫికెట్, ఆట వస్తువులు ఉదయం, సాయంత్రంస్నాక్స్,ఎగ్స్, పండ్లు అందించడం జరుగు తుందన్నారు.ఈ ఉచిత శిక్షణకు మీ పిల్లలను పంప గలరని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా రని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లువార్డ్ కౌన్సిలర్లకు, తల్లి దండ్రులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్యాంపు ఇన్చార్జ్ పి.బిక్షపతి 9948213518 నెం బర్లు సంప్ర దించాలని కోరారు.