Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు ఇవే...
గౌరవ వేతనం ఇవ్వాలి. బియ్యం దిగుమతి హమాలి చార్జీలు ప్రభుత్వమే భరించుకోవాలి. విద్యావంతులను వారి శాఖపరమైన సేవలో నియామకం చేయాలి. ప్రతి డీలర్ కు హెల్త్ కార్డు ఇవ్వాలి. బియ్యంతోపాటు ఇతరత్రా సరుకులు పంపిణీ చేయాలి. షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలి. పట్టణంలో రూ.60వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేలు ఇవ్వాలి. అనే ప్రధాన డిమాండ్లతో సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
- సకాలంలో అందని బిల్లులు
- కమిషన్ కరెంట్ బిల్లులకే సరి
నవతెలంగాణ-మల్హర్రావు
ఇప్పటికే పలు శాఖల్లో సిబ్బంది తమ సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మె బాట పట్టడంతో ఆ శాఖల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది.ప్రస్తుతం జేపీఎస్, విఓఏల నిరవధిక సమ్మెలు కొనసాగుతుండగా వీఆర్ఏ లు తమకు పేస్కేల్, పదోన్నతులు పలు డిమాండ్లతో మంత్రి కెటిఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు సమ్మెను సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తరు ణంలో రేషన్ డీలర్లు తమకు గౌరవ వేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తో సమ్మెను సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.
మండలంలో మొత్తం 19మంది రేషన్ డీలర్లు ఉన్నారు. గతంలో 9 రకాల సరుకుల పంపిణీ జరిగింది. ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. క్వింటాలుకు రూ.70 మాత్రమే కమిషన్ చెల్లిస్తున్నారు. అందులో హమాలి దిగుమతి రూ.10 పోను రూ.60 మాత్రమే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఒక షాపుకు 80 క్వింటాళ్లు కేటాయిస్తే దాంతో కమిషన్ రూ.5,600 వస్తే అందులో ఇంటి అద్దె రూ. 2,500 పోను, హమాలి చార్జీలు రూ.800 పోతే డీలర్ కు మిగిలేది రూ.2,300. కాగా దానిలో కరెంట్ బిల్లు, ఇతరత్రా పోను నెలకు రూ.2వేలు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోజుకు వంద రూపాయలు రావడం లేదంటున్నారు. దీనికి తోడుగా ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ జరుగుతుంది.
సమస్యలతో సతమతం..సమ్మెకు సిద్ధం
వచ్చే కమిషన్ సరిపోక అద్దె,కరెంట్ బిల్లులు, ఇతరత్రా వాటితో నానా తంటాలు పడుతున్నారు.దానికి తోడు తూకంలో తేడా ఇలాంటి సమస్యలతో సతమత మవుతున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన ప్రభుత్వం స్పందించలేదని డీలర్లు వాపోతున్నారు. డీలర్లు సమస్యల సాధనకై జెఏసీ ఆధ్వర్యంలో జూన్ నెల నుంచి నిరవధిక సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ సంఘము నాయ కులు చెబుతున్నారు.డీలర్ల సమ్మె విషయంపై ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకొని సమస్యలు పరిష్కరిస్తుందా లేదా అనే విషయం వేచిచూడాల్సిందే.