Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీపీ బందెల స్నేహలత నరేష్
నవతెలంగాణ-టేకుమట్ల
భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు మాపై, మా నాయకుడైన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై అస త్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని మానుకోవాలని మాజీ ఎంపీపీ బందెల స్నేహలత నరేష్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పద్ధతులు మరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రోత్సహిస్తున్న గండ్ర సత్యనారాయణ రావు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. మేము కాలనీవాసులకు అన్యాయం చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధం చట్టం ప్రకారం కొనుక్కున్న భూమిని మాపై గిట్టని కొందరు వ్యక్తులు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్, మాజీ ఎంపీపీని మహిళను అని చూడకుండా తనకు ఇబ్బంది కలిగేలా వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఏంటని ప్ర శ్నించారు. ప్రజా అభివద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.