Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ హయాంలోనే దళితులకు ఉచిత విద్యుత్ : ఎంపీపీ
నవతెలంగాణ-ఆత్మకూర్
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఏలుకుర్తి గ్రామంలో దళిత కాలనీలో గత 3రోజులుగా కరెంటు బంద్ చేయడంతో ఆదివారం దళిత కాలనీకి చెందిన మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు మీటర్లు లేని వారందరు వెంటనే మీటర్లకు దరఖాస్తు చేసుకోనీ ప్రభుత్వం అందించే 101 యూనిట్ వరకు వాడుకునేందుకు ఉచితంగా రాయితీ అందిస్తుందని దానిని వినియోగిం చుకోవాలని అంటున్నారు. తరచు విద్యుత్ చౌర్యానికి పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని విద్యుత్ అధికా రులు హెచ్చరిస్తున్న విషయం తెలిసినదే. కాంగ్రెస్ హయాంలోనే దళిత కాలనీలల్లో ఉచిత కరెంటు అందించిందని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దళిత కాలనీ వాసుల పై విజిలెన్స్ దాడులు చేస్తూ, విద్యుత్ నిలి పేస్తున్నారని ఎంపీపీ సౌజన్య మండిపడ్డారు. ఆదివారం మహిళలు, యువకులతో కలిసి సబ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దళితుల పై కేసులు నమోదు చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళిత కాలనీలో విద్యుత్‌ను పునరుద్ధరించకుంటే జాతీయ రహదారిపై ఆందోళనలు చేస్తామని హెచ్చ రించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు తిరు గుబాటు చేసి బీర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదిం చాలని పిలుపునిచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ తో పాటు విద్య, వైద్య, రైతందానికి పెద్దపీట వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.