Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
విధుల్లో ఉన్న రెవెన్యూ సహాయకులపై మట్టి మాఫియా దాడులకు పాల్పడి నాలుగు రోజులైనా చర్యలు తీసుకోకుండా కాలయా పన చేస్తున్నారని సీఐటీయూ మండల కార్యదర్శి కట్ల నరసింహచారి విమర్శించారు. ఆదివారం సీఐటీయూ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగురోజుల క్రితం అక్రమంగా మట్టి తొలకలు జరుగుతున్నాయి అనే సమాచారం రెవెన్యూశాఖ ఉన్నతాధికా రులకు అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ సహాయకులు అడ్డుకు న్నారు. దాంతో అగ్రహింవహిన మట్టి మాఫి యూ అక్కడ పనిచేసేందుకు వినియోగిస్తున్న యంత్ర తో దాడి చేశారు అన్నారు. ఈ విష యంపై రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసు లకు పిర్యాదు చేశారు. అయినా ఇప్టపి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రెవెన్యూ సేవకుల పై దాడికి పాల్పడిన దళారి పై ఎస్టీ, ఎస్సి కేసునమోదు చేయాలని డి మాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే సీఐ టీయూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతా మని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు వాయిలాల పోశాలు, బ్రహ్మం, నాగాచారి, ముత్తేష్,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.