Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులకు కాలపరిమితిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పది రోజులుగా జూనియర్ పంచా యతీ కార్యదర్శులు చేపడుచున్న శాంతియుత సమ్మె లో భాగంగా ఆదివారం జూనియర్ పంచాయతీ కా ర్యదర్శుల కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నా రు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమై న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబ స భ్యులు ప్లే కార్డులు చేత భూని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యద ర్శుల సంఘం మండల నాయకులు యుగంధర్, మ హేష్, రమ్య, శ్రీకాంత్, చంద్రశేఖర్, సతీష్, వెంకటే ష్, శిరీష, అనూష, కవిత తదితరులు పాల్గొన్నారు.
గార్ల : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం వెంటనే జీవోను విడుదల చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కిషన్ నాయక్, రామకృష్ణలు ప్రభుత్వా న్ని కోరారు. జేపీఎస్‌ల సమ్మె ఆదివారం 10వ రోజు కు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాల యం ముందు వంటావార్పుతో వినూత్నంగా నిరసన తెలిపారు. జేపీఎస్‌లను మూడేళ్ల తర్వాత క్రమబద్ధీక రిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిల బెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ లు క్రాంతి కుమార్, కిరణ్, రమేష్, మంగీలాల్, వెంక టేశ్వర్లు, రమేష్, వెంకటేష్, నరసింహారావు, కుమా ర్, మహేష్, సురేందర్, కిషోర్, రాజేందర్, అనిల్, అభిలాష్ తదితరులు ఉన్నారు.
కొత్తగూడ : జూనియర్ పంచాయతీ కార్యదర్శు ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారిని రెగ్యులరైజ్ చేయాలని ఐఎఫ్‌టి యు ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి రాజమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జేపీఎస్‌లు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఐఎఫ్టియు మండల క మిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిం చాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దు న్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరించ డం సరైంది కాదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ను ఉద్యోగ హక్కు చట్టాల పరంగా వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జేపీఎస్‌ల పక్షాన దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ రాష్ట్ర సహా య కార్యదర్శి శ్రీశైలం, అఖిల భారత రైతు కూలి సం ఘం మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగం ధర్, జిట్టబోయిన రామచంద్రు, గట్టి వెంకన్న, వల్లెపు సాంబరాజు, వంశీ, రాఖి, సాంబయ్య పాల్గొన్నారు.