Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
వివోఎల సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలం చెందిందని తక్షణమే వారి సమస్య పరిష్కరించాలని సిఐటీయూఆధ్వర్యంలో వివోఏలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అం దించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఈసంప ల్లి సైదులు మాట్లాడుతూ వివోఏలు సమ్మె ఆదివారం రోజుకి 21వ రోజు చేరిందని నేటి వరకు ఈ సమ స్యలు ఎందుకు పరిష్కరించడంలో విఫలం చెందుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు అధి కారులు నేటికీ వివోఏల సమస్యల పరిష్కరించక పో వడంతో అంబేద్కర్కువినతిపత్రాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్రు యాకయ్య బాలా జీ, రమేష్, నషియత్బేగం, ఇందిరా, భాగ్యలక్ష్మి, శ్వేత, హైమావతి, స్వప్న, ఉష,సరిత, రేణుక, ఆదిలక్ష్మి, విజ యలక్ష్మి, యాగమా ఉమ, ఉపేందర్, అశోక్, శ్రీను, హైమావతి వివిధ గ్రామాల వివోఏలు పాల్గొన్నారు.
గార్ల : కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి కార్మికు డికి నెలకు 26 వేల రూపాయల వేతనం చెల్లించాల ని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్య దర్శి తాడబోయిన శ్రీశైలం డిమాండ్ చేశారు. స్దానిక నెహ్రూ సెంటర్లో తెలంగాణ ఐకేపి వివోఏల సం ఘం (సిఐటియు) అధ్వర్యంలో చేపట్టిన నిరవధిక స మ్మె ఆదివారం 21వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంఘిభావం తెలిపారు.ఈకార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు కందుల శోభారాణి,మండల అధ్యక్ష, కార్య దర్శులు బి.ఉమ, వినోద, వివోఏలు అనిత, వీర లక్ష్మి, జీ.లక్ష్మి, అరుణ, కల్పన, మాలతి, సరోజ,వెంకటలక్ష్మి, శ్రీజ, విజరు కుమార్, శ్రీను, సరిత పాల్గొన్నారు.