Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఎంఎస్ మండల కోఆర్డినేటర్ సంగ పొంగు శ్రీను అన్నారు. ఆదివారం మండలంలోని ఇర్సులాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీక రించాలని ఎమ్మార్పీఎస్ గత 29 సంవత్సరాలుగా పోరాడుతుందని, రాజ్యాం గంలో పొందుపర్చబడ్డా ఎస్సీ రిజర్వేషన్లను ప్రతీ రాష్టంలో ఒకటి రెండో కులా లు వారిసొంత కుల జనాభా కంటే అదనంగా పొందుతున్నారని పేర్కొన్నా రు. దానివల్ల ఎస్సీలలోని ప్రతి కులానికి రావాల్సిన న్యాయమైన వాటా దాక్క డం లేదని, అందువల్ల విద్య, ఉద్యోగం, సంక్షేమం రాజకీయ రంగాలలో ఎస్సీ లు వెనుకబడి పోతున్నారన్నారు. ఈ విధానాన్ని సరిచేసి ఎస్సీలలోనీ ప్రతి కు లానికి న్యాయం జరిగేలా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరారు.ఈ కార్య క్రమంలో ఎమ్మార్పీఎస్ మండలం నాయకులు వడ్డురి సారయ్య, ఎంఎస్ఎఫ్ పదిశాల రమేష్, జినక రవి, సాయి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.