Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడే స్ఫూర్తితో ఉద్యమాలు జరగాలి
- గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాల్సిందే
- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...
- భూపాలపల్లిలో మేడే వారోత్సవాల ముగింపు సభ
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో ఉద్యమాలు జరగాలని శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించాలని జిల్లా కేంద్రంలో వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాల్సిందేనని వీరభద్రం అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ అంగడి మైదానంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వారోత్సవాల ముగింపు సభకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షత వహించగా రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ తో కలిసి తమ్మినేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుండి గణేష్ చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా సుభాష్ కాలనీ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అవలంభిస్తున్న బీజేపిని ఓడించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. భూపాలపల్లి జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చి పక్కా గహాలు నిర్మించివ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ వాగ్దానాన్ని అమలు చేయాలని, ఖాళీ స్థలంఉన్న ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు. మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బిజెపి మతోన్మాద శక్తులను కూల్చివేయాలన్నారు. దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు కట్టబెడుతూ, దేశ ప్రజలపై భారాలను మోపుతోందదన్నారు. దేశంలో 23కోట్ల మందిని పేదలుగా చేశారన్నారు. దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు చేపిస్తూ, కులాలు, మతాల పట్ల చిచ్చులు పెట్టడంతో పాటు బీజేపీ ఎంఎల్ఎలు, ఎంపీ లు, మంత్రులు తినేతిండి-పై, వేసుకునే బట్టలపై అధిపత్య చిచ్చుపెట్టి దేశాన్ని మతోన్మాద దేశంగా మార్చేందుకు కట్ర పన్నుతోందన్నారు. పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ల నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పూర్తిగా తమ రిజర్వేషన్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నిత్యావసర సరుకులు, పెట్రోల డిజిల్, వంట నూనె, వంట గ్యాస్ ధరలు మూడింతుల పెరి గాయన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ.... కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఇప్పటివరకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నిర్లక్ష్యం చేసిందన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ లను ప్రవేటికరిస్తుంది. జీరో అకౌంట్ లో ఒక్కొక్క అకౌంట్కు 15 లక్షలు ఇస్తామని చెప్పి మోసగించిందన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజల మీద పెనుబారం మోపిందన్నారు. ఉపాధి హామీ చట్టం అటవీ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నదన్నారు. 49 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడుదారులకు అనుకూలంగా చట్టాల మార్పు చేయటం అన్యాయం అన్నారు. రోజుకూలి 176 రూపాయలుగా మోడీ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గం అన్నారు. జిల్లా కేంద్రంలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 లక్షలు ఇచ్చేవరకు ఉద్యమాలను ఉధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మేడే ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడలలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్ ,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్, వెలిశెట్టి రాజన్న, చెన్నూరి రమేష్ ,కం పేట రాజన్న, దామెర కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం దేవేందర్, శ్రీకాంత్, వినరు, మల్లన్న , రాజేందర్, ప్రీతి, వార్డు కమిటీ మెంబర్స్ శ్రావణ్ , రవికుమార్ ,నరేష్ రమేష్, కోమల, విజయలక్ష్మి, ఓదక్క ,రజిత, వెంకటేష్, శ్రీ వేణి, రమేష్ ,ఉషారాణి స్వర్ణలత వాలంటీర్స్ నీలిమ సుజాత వైష్ణవి మౌనిక, కవిత, స్వాతి, కళ్యాణి, విలాసిని, సునీత, మానస, వసుంధర, లావణ్య స్రవంతి, రజిత ,శతి, తదితరులు పాల్గొన్నారు.