Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
గ్రామపంచాయతీ ఉద్యో గ కార్మికులకు అన్యాయం చేసే జీవో 51ను ప్రభుత్వం వెంటనే సవరించాలని తెలంగాణ గ్రా మ పంచాయతీ కారోబార్ సిబ్బంది యూనియన్ మండల అధ్యక్షుడు కాసాని అశో క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిం చాలని మండల కేంద్రంలో జీపీ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పేరుతో కారోబార్ బిల్ కలెక్టర్లతో చీపురు పట్టించడం దారుణమన్నారు. జీపీ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా రూ.2 లక్షలలు ఇన్సూరెన్స్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వ హణ, ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరి హారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో ఉపాధ్యక్షుడు సుమన్, కార్యదర్శి దేవా, కోశాధికారి కళ్యాణ్, సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు దేవేందర్, కుమారస్వామి, చిలుక పవన్, ప్రమీల, వెంకటమ్మ, యాకయ్య, ఎల్లమ్మ, రాజు, మైసయ్య, సత్తయ్య, శ్రీకాంత్, యాకలక్ష్మి, శ్రీలత, బిక్షం తదితరులు పాల్గొన్నారు.