Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
తమ గ్రామంలో ఇటీవల చే పట్టిన గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి వంతెనను తొందరగా పూర్తయ్యేట్లుగాసంబంధిత శాఖా అధికారులను ఆదేశించాలని కలె క్టర్ శివలింగయ్యను మండలం లోని నమిలిగొండ గ్రామ సర్పంచ్ డ్యాగల ఉప్పలస్వామి కోరారు. ఈ సందర్భం గా కలెక్టర్ స్పందిస్తూ అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, నాణ్యతా విషయంలో స్థాని కులు దగ్గరుండి, పర్యవేక్షించుకొని పనులు జరిపించుకోవాలని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో ఉపసర్పంచ్ చందు, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు స్వాతి శ్రీని వాస్, యూత్ నాయకులు అట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.