Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ శివలింగయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉండకూడదని, అలా జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ శివలింగ య్య హెచ్చరించారు.సోమవారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు ఎం త ధాన్యం వస్తుందని, ట్రక్ షీట్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఎలాంటి భయాందోళన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయుటలో ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాల్సిందిగా రైతులను కోరారు. జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాలలో అధిక ధాన్యం వచ్చే చోట్ల కాంటలను పెంచుకోవాలని తెలిపారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొ నుగోలు చేస్తూనే, కొనుగోలు చేసిన వెంటనే తరలించాలని, ఆ క్రమంలో వాహనా లను ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసా రం సోషల్ వెల్ఫేర్ హౌజ్ సైట్ల సర్వే, స్థానికంగా ఉన్న రెండు సైట్లలో జరుగుతు న్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మ హిళ కార్యక్రమం ప్రతీ మంగళ వారం పకడ్బందీగా అమలు చేయాలని అధికారు లను ఆదేశించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏరియా ఆస్పత్రికి తరలిం చి మెరుగైన వైద్య సేవలు వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించా లని వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. తొలుత డివిజన్ కేంద్రం లో ఆర్డీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు నిర్వహణపై సంబంధిత అధికారుల తో కలిసి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్డి ఓ రాంరెడ్డి, డిసిఓ కిరణ్ కుమార్, డిసిఎస్ఓ రోజారాణి, సివిల్ సప్లై డీఎం సం ధ్యారాణి, స్థానిక తహసిల్దార్ పూల్ సింగ్, ఇంచార్జీ ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, ఎంపీ ఓ సుధీర్ కుమార్,సర్పంచ్ ఉప్పలస్వామి, ఏపీఎం కవిత, ఆర్ఐ రవీందర్, తది తరులు పాల్గొన్నారు.