Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న
నవతెలంగాణ-మరిపెడ
జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ చట్టాన్ని నిర్వీ ర్యం చేసే చర్యలను కేంద్ర బిజెపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కా ర్మిక సంఘం మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. సోమవారం రోజున మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రా మంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలు ఎదుర్కొంటు న్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఉపాధి హామీకి గత బడ్జెట్ కంటే 30 వేల కోట్ల రూపా యలు తగ్గించి కూలీల నోట్లో మన్ను కొట్టారని రాజన్న మండిపడ్డారు. ఉపాధి హా మీలో అనేక సవరణలు తీసుకొచ్చి ఉపాధిని తీసివేసే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. పనిచేసిన కూలీలకు వారం వారం కూలీ డబ్బులు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, కూలీలకు పనిముటు,్ల టెంట్లు ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు ఆరుదాస్ సోమయ్య, వీర మహేష్, ఎల్లబోయిన చంద్రయ్య, చలమల వెంకటమ్మ, ఎలుబోయిన రాణి, స్వరూప, ఈర్ల పుల్లయ్య, బల్లెం నాగమణి, ఎడెల్లి వీరమ్మ పాల్గొన్నారు.