Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమం సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సూచనల మేరకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య వయోవృద్దుల పోషణ ఫిర్యాదుల వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరాదరణకు గురైన తల్లిదండ్రులు లేదా వ యోవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకోనటువంటి పిల్లలపై ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసెస్ మాంటెనెన్స్ సిస్టం వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు చే యొచ్చని సూచించారు. ప్రయోవృద్ధులు తమ ఫోన్ల ద్వారా, ఇతర ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఈ వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, నమోదైన ఫిర్యాదు లకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలె క్టర్ ప్రఫుల్ దేశారు, ఆర్డిఓ మధుమోహన్, ఏకే మన్సూరి, జిల్లాసంక్షేమ శాఖ అధి కారి జయంతి, ఉద్యానవన శాఖ అధికారి లతా, దుర్గారావు, రాజు, సంపత్, సదా నందం, సుధాకర్, రవికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.