Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాబూబాబాద్
బాల్య వివాహాలు నిర్మూలనపై మత పెద్దల ప్ర చార కార్యక్రమం అభినందనీయమని మహబూబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ డాక్టర్ నాగవాణి అన్నారు. సోమవారం స్థానిక జ్యోతి బస్సు నగర నం దు ఎఫ్ఎం సోషల్ సర్వీస్ సొసైటీ చైల్డ్ లైన్ 1098 సంయుక్తంగా గర్ల్స్ అడ్వకేసి యాక్షన్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై ముస్లిం హిం దూ మత పెద్దల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్ర మం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎఫ్ఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డాక్టర్ నాగవాణి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పేదరికం, నిరుద్యోగం, సరైన ఉపాధి లేక పోవడం వలన పిల్లలపైన మహిళలపై హింస అనేది ఎక్కువ గా జరుగుతుందని అన్నారు. వివాహ నిర్ణయ సమ యంలో సరైన వయసు ధ్రువీకరణ పత్రాలు పరిశీ లించిన తర్వాతనే వివాహాన్ని నిర్ణయించి తగిన ము హూర్తాన్ని కేటాయించాలని దీనిపట్ల మతపెద్దల స హకారాన్ని అందించి మహబూబాబాద్జిల్లాలో బాల్య వివాహాలు లేని సమాజాన్ని సృష్టించాలని కోరారు. పూజారి పుల్లయ్య శాస్త్రి మాట్లాడుతూ ఇంకా సమా జంలో బాల్య వివాహాల పట్ల అవగాహన లోపం ఉం దని దీనిని నిర్మూలించుటకు మా వంతుగా తగిన బాధ్యత తీసుకొని తల్లిదండ్రులకు,పిల్లలకు సమాజం లోని అన్ని వర్గాలకు తగిన ప్రచారాన్ని చేపడతామని అన్నారు. ఎండి షహీబుద్దీన్ మాట్లాడుతూ ఎవరైనా పెళ్లి ముహూర్తానికి నీకానామా రాయించుకోవడా నికి వచ్చినప్పుడు వారి వయసు ధ్రువీకరణ పత్రాలు సదర్ ఖాజీ ఆఫీస్ నందు తగిన అనుమతి తీసుకొని పెళ్లిళ్లు ఖరారు చేస్తున్నామని ఎవరైనా బాల్య వివా హం జరుపుతున్నట్లయితే దానిని వ్యతిరేకిస్తూ నిలు పుదల చేస్తున్నామని తెలిపారు. ఎఫ్ఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బత్తుల కరుణ మా ట్లాడుతూ మహిళల్లో పేదలకు పేదరిక నిర్మూలన కొ రకు మగ్గం, టైలరింగ్ లాంటి శిక్షణ ఏర్పాటు చేసి వా రి జీవనోపాధికి సహకరిస్తున్నామని, కుటుంబంలో పేదరికం తగ్గుతుందని తద్వారా కుటుంబంలో హిం స గాని బాల్య వివాహాలు జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ తప్పెట్ల వెంకటేష్, మహబూబాద్ జిల్లా ఖాజీ ఎండి అక్రమ్, రాయపర్తి, తొర్రూర్ కాజీలు,సైలెంట్ సిబ్బం ది అరుణ, ఖాజాబీ, వెంకటేష్, ఉపేందర్,అనిల్ కుమార్, చందు,బాలికలు మహిళలు సుమారు 100 మంది హాజరైనారు. అనంతరం నిరుపేద మహిళల కు ఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉచితంగా సామాగ్రి అందజేయడం జరిగింది.