Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
గత ఆరు వారాలుగా తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు వడగండ్ల వల న రైతాంగం దారుణంగా నష్టపోయారని, ఆరైతులకు తక్షణమే ఎకరానికి 30 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో బైక్‌ర్యాలీ నిర్వహించి అనంతరం తాహసి ల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం గౌని ఐలయ్య మాట్లా డుతూ తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, మొక్కజొన్న, వరి, పత్తి, మిర్చి, మామిడి తోటలతో పాటు పండ్ల తోటలు, అపరాల పంటలు ధ్వంస మయ్యాయని, మార్చి 23న సీఎం రా ష్ట్రంలో పంటల నష్టాన్ని పరిశీలించి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహా రాన్ని ప్రకటించినా ఇంతవరకు వాటి జాడే లేదన్నారు. వర్షాలు, వడగండ్లు, ఈదు రు గాలులు గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయని, రోడ్ల పైన ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు నీళ్లలో తడిసి ముద్దయ్యాయని, తడిసిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మా టలు గాలి మాటలు గానే మిగిలిపోయాయన్నారు. మార్చి 21 వరకు జరిగిన పం టల నష్టానికి పదివేల రూపాయల పరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్న సీఎం ఆ తర్వాత అకాల వర్షాలకు నష్టపోయిన లక్షలాది మంది రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం లే దని, 2020 నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆపి వేసిన రా ష్ట్ర ప్రభుత్వం సొంత బీమా పథకాన్ని తీసుకురాలేదని, ఫలితంగా ప్రకృతి విపత్తుల నష్టానికి పరిహారం అందడంలేదని, ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిహారం జరిగిన న ష్టంలో పదో వంతు కూడా ఉండడం లేదని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు ను ఆలస్యంగా ప్రారంభించి 7031 కొనుగోలు కేంద్రాలకు గాను కేవలం 2161 కేంద్రాల ద్వారా మాత్రమే దాన్యాన్ని సేకరించటం వలన అసాధారణ జాప్యం జరి గి కొనుగోలు కేంద్రాలలో నెల రోజులకు పైగా కాటాలు కాకుండా ఆగిపోయాయ ని, ఫలితంగా అకాల వర్షాల బారిన పడి తడిసి ముక్కిపోయాయన్నారు. రాష్ట్రం లో విస్తారంగా పండిన మొక్కజొన్న పంటను ఈ సంవత్సరం ప్రభుత్వం కొనడాని కి ముందుకు రానందున ప్రభుత్వ మద్దతు ధర 1962 రూపాయలున్నా రైతులు క్వింటాలకు 1600 నుండి 1700 ధరకు మాత్రమే వ్యాపారస్తులకు అమ్ముకున్నా రని, తీరా 80శాతం మొక్కజొన్న పంట రైతుల చేతి నుండి పోయిన తర్వాత ఇప్పు డు మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిం దని, దీని వలన రైతుల కంటే వ్యాపారస్తులకే ఎక్కువ లాభం కలుగుతుందన్నారు. మార్చి ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అకాల వర్షాల వలన నష్టపోయిన పంటలను స మగ్రంగా పరిశీలన చేసి తగిన నష్టపరిహారం అందించాలని, ఎకరానికి మొక్కజొ న్న పంటకు, అపరాలకు 20000, వరి పంటకు 30000, పత్తికి 40,000, మిర్చి కి 50000, మామిడి, ఇతర పండ్లతోటలకు 75000 చొప్పున పరిహారం చెల్లించా లన్నారు. ఈ డిమాండ్ల పై 8,9,10 తేదీలలో మండల, జిల్లా కేంద్రాలలో ప్రదర్శన లు ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సనప పొమ్మయ్య, మండల అధ్యక్షులు రామగిరి బిక్షం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి మోకాళ్ళ మురళి క్రిష్ణ, మైదాన మండల కార్యదర్శి మాదం శెట్టి నాగేశ్వరరావు, పాయం సమ్మయ్య, తుడుం వీరభద్రం, ఏఐకేఎంఎస్ మండల నాయకులుమేకపోతుల నాగేశ్వరరావు,పూనెంలింగన్న, తొగర కొమరయ్య, భూక్యా రాము, నెహ్రూ, కొదుమూరి వీరభద్రం, మెంగు భగవాన్, హన్మా, గుండెబోయిన లింగమల్లు, మంగీలాల్, గంగులు తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి
కొత్తగూడ : పంట నష్టపోయిన రైతులందరికీ సమగ్ర పంటల బీమా పథకా న్ని అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పాలడుగు కృష్ణ స్మారక భవన్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించి తహసిల్దార్ వద్ద ధర్నా నిర్వహించారు.అనంతరం అకాల వర్షానికి గురైన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సేకరించిన వివరాలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకా ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. అకాల వర్షాలు వడగండ్ల వర్షాలతో వరి మొక్కజొ న్న పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, కొంతమేరకు చేతికి వచ్చిన పంట కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించక పోవడంతో వర్షాలకు తడిసి ధాన్యం మొక్కజొన్నలు రంగు మారాయని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభు త్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు వర్షాలతో నష్టపోతున్న రై తులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక వ్యాపారులతో మోసం పోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోడు కౌలు రైతులకు కూడా పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు ఆగబోయిన నర్సక్క, ఏఐకే ఎంఎస్ మండల అధ్యక్షులు బూర్క బుచ్చి రాములు,మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగంధర్, ఉపాధ్యక్షులు జిట్టబోయిన రామచంద్రు, సహాయ కార్య దర్శి గజ్జి సోమన్న, కోశాధికారి పిట్టల దేవేందర్, నాయకులు గట్టి సురేందర్, జం గా సదయ్య, పోర్ల బిక్షం,సత్యం, సుధాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.