Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్‌కు కొనుగోళ్ల బాధ్యతలు వద్దని ఎంపీటీసీ ఫైర్
- సమస్య ఉంటే కూర్చొని మాట్లాడాలని సర్దిచెప్పిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-శాయంపేట
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేం ద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం కొది ్దసేపు రసాభాసాగా మారింది. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి హాజరు కాగా అక్కడే ఉన్న ఎంపీటీసీ బాసాని చంద్రప్రకాష్ పీఏసీఎస్‌కు కొనుగోలు కేంద్రా ల నిర్వహణ బాధ్యత ఇవ్వవద్దని గతంలో ఇవ్వడం వ ల్ల రైతులకు బస్తాకు 4 కిలోల ధాన్యం కోత, డబ్బుల చెల్లింపుల్లో కోత విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డట్లు తెలిపారు. ఐకేపీకి కొనుగోలు బాధ్యత అప్పగించాలని తెలిపారు. అక్కడే ఉన్న పీఏసీఎస్ చై ర్మన్ కుసుమ శరత్ కలగజేసుకొని గత ఏడాది ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బాధ్యత అప్పగించారని, వారి హయాంలోనే అక్రమాలు జరి గాయని తెలిపారు. తనపై వ్యక్తిగత కోపంతోనే చెబు తున్నారన్నారు.
దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవా లని బహిరంగంగా మీడి యా సమక్షంలో ఇలా అను కోవడం సరికాదన్నారు.
దీంతో ఎంపీటీసీ తమకు ఉదయం 8 గంటలకు కొ నుగోలు కేంద్రం ప్రారంభో త్సవం ఉందని సమాచా రం అందించారని, ఇక్కడికి వచ్చాకే పీఏసీఎస్ ఆధ్వ ర్యంలో కేంద్రంనిర్వహిస్తున్నారని తెలిసిందని, అందు కే మీ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రం కూడా మండల కేంద్రంలోనే కా కుండా అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ సమాచారం స్థానిక సర్పంచ్‌గా తనకు కూడా చెప్పలేదని సర్పంచ్ రవి ఎమ్మెల్యేకు విన్నవించారు. అక్కడే ఉన్న ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం షెడ్యూల్ ఖరారు కాగానే ఒకరోజు ముందే మండల నాయకులందరికీ తెలియ జేశానని తెలిపారు. ఎమ్మెల్యే మీడియా ముందు కా వాలని అల్లరి సష్టిస్తున్నారని వారిపై మండిపడ్డారు.
దీంతో ఎంపీటీసీ చంద్రప్రకాష్ కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం నుండి వెళ్లిపోతుండడంతో ఎ మ్మెల్యే సర్దిచెప్పి ఎంపీటీసీతో కొబ్బరికాయ కొట్టించా రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంద రూ ఒకే కుటుంబ సభ్యుల వలే కలిసిమెలిసి ఉండా లని, చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఉంటే కూర్చు ని మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా మాట్లాడు కుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. అనంతరం వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేం ద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.