Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని సర్వే నంబర్ 813లో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు జీవో నంబర్ 58 ప్రకారం ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేప ట్టారు. ఈ సందర్బంగా నర్సంపేట నియోజ కవర్గ ఇంచార్జి కల్లేపెల్లి ప్రణయ్‌దీప్ మాట్లాడారు. నర్సంపే టలోని అంబేద్కర్‌నగర్‌లో 500 మంది నిరుపేద కు టుంబాలు అనేక ఇబ్బందులను తట్టుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం కల్పించిన జీ వో నంబర్ 58ని తమకు వర్తింపచేస్తూ పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చే శారు. అనంతరం పలుడిమాండ్లతో కూ డిన వినతిపత్రంను కలెక్టర్ కు అందజేశా రు. మహాజన సోషలిస్టు పార్టీ నియోజ క వర్గ ఇంచార్జి కల్లేపెల్లి ప్రణరు దిప్, దళిత బలహీనవర్గాల ప్రజాస్వామిక పో రాట సమితి జాతీయ అధ్యక్షుడు అందే రవి, తడుగుల విజయ్, జలగం రమేష్, మునిగే యాకుబ్, అజ్మీరా అజయ్‌లు పాల్గొన్నారు.