Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్గీకరణ వ్యతిరేక బీఎస్పీకి మాదిగలు దూరంగా ఉండాలి
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్మాదిగ
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలకు పంపిణీ చేయాలని కొనసాగుతున్న ఎస్సీవర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న బీఎస్పీ చీఫ్ మాయావతి రిజర్వేషన్లను దోచుకునే వర్గాలకు వత్తాసు పలుకుతోందని ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ విమర్శించారు. కాకతీయ యూనివ ర్సిటీ ఇంచార్జి డాక్టర్ వడ్డేపల్లి మధు ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన భరో సా సభలో పాల్గొన్న మాయావతి ఎస్సీవర్గీకరణపై ప్రకటన చేయకుండా మాదిగ ల హృదయాలను గాయపరిచిందన్నారు.ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపితే బీఎస ్పితో కలిసి పనిచేస్తామని తెలుపుతూ మాయావతికి లేఖ రాసి మంద కష్ణమాది గ మితృత్వ ద్వారాలు తెరిస్తే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాయావతి ఆ ద్వా రాలను మూసివేసిందని అన్నారు. మాయావతికి ఉత్తరాది చమర్ల ప్రయోజనాలే తప్ప దక్షిణాది మాదిగల బతుకులు గురించి పట్టింపు లేదన్నారు. ఉత్తరాదిలో చమర్లు ఎస్సీ రిజర్వేషన్లను ఏకపక్షంగా దోపిడీ చేస్తున్నారని, ఆ దోపిడీ కొనసా గాలనే స్వార్థంతోనే ఎస్సీ వర్గీకరణను మాయావతి వ్యతిరేకిస్తోందని అన్నారు. దక్షి ణాది మాదిగల ఆకాంక్షలకు విలువనివ్వని స్వార్థపూరితమైన మాయావతి నాయ కత్వం మాదిగలకు అవసరం లేదన్నారు. మాదిగలంతా బిఎస్పీకి దూరంగా ఉం డాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక జనాభా కలిగిన మాదిగ జాతి ఆ కాంక్షను మాయావతికి వినిపించి ఆమెను ఒప్పించడంలో ప్రవీణ్ కుమార్ పూర్తి గా విఫలమయ్యారని అన్నారు.రాజ్యాధికారం సాధిస్తే అన్ని పరిష్కారం చేసుకోవ చ్చు అని మాట్లాడుతూన్న మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో నాలుగుసార్లు రాజ్యా ధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణను ఎందుకు చేయలేదు ? అని ప్రశ్నించారు.
సైద్ధాంతికంగా ఎస్సీ వర్గీకరణను బలపరచని పార్టీలు రాజ్యాధికారం సాధిం చలేవు,ఎస్సీ వర్గీకరణకు మద్దత్తు తెలపని పార్టీలు అధికారంలోకి వచ్చిన అమలు చేయవు కనుక మాదిగలు రాజ్యాధికారభ్రమల్లో ఉండి బీఎస్పీని నమ్మి మోసపో వద్ద న్నారు. ఎస్సీ వర్గీకరణ బలపరిచే రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నేతవేల్పుల సూరన్న, జాతీ య అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్ను దినేష్ మా దిగ, హన్మకొండ జిల్లా నాయకులు గోవిందు అభిలాశ్ మాదిగ, కడార్ల నవీన్, వడ్ల కొండ సంజరు తదితరులు పాల్గొన్నారు.