Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవీ గణేష్
నవతెలంగాణ - ములుగు
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వైవి గణేష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమా వేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిం చారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... తమ శాఖ కు సంబంధించి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిం చాలని, తిరస్కరించిన వాటికి సవివరమైన వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ రోజు ప్రజావాణిలో మొత్తం 45 దరఖాస్తులు రాగా, అందులో 16 రెవెన్యూశాఖకు, 3 2-బిహెచ్కే, 26 ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయన్నారు. స్వీకరించిన వాటిలో కొన్నిం టిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో ప్రసూన రాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డిపిఓ వెంకయ్య, సిపిఓ ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, డివైఎస్ఓ వెంకటరమణ చారి, డివిహెచ్ఓ విజయ భాస్కర్, డిసిఓ సర్దార్ సింగ్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డిడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డీసీఎస్ఓ అరవింద్ రెడ్డి, డిఎండిసిఎస్ఓ రాములు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.