Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు అపరిశుభ్రతపై యుద్ధం ప్రకటించాడు. గ్రామ సభలో ఎన్నిసార్లు చెప్పిన ప్రజల్లో మార్పు రావడం లేదని, గ్రామ పరిశుభ్రతపై పరివర్తన తెచ్చేం దుకు ఓ ప్రజాప్రతినిధిగా ప్రజల వద్దకే వెళ్లి 'ఊరు-వాడ', 'ఇల్లు-వాకిలి' శుభ్రం చేసే కార్యక్రమం గ్రామంలో సోమవారం 5వ రోజు కొనసాగింది. శివాజీ చౌక్ చౌరస్తా నుండి వాసవీనగర్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వరకు రోడ్డుపై మట్టి,ఇసుక,రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు తొలగించడం, డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, మురుగు తొలగించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈ ఊరు నాది అనే భావన కలుగాలని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. సమాజంలో పరివర్తన(మార్పు)కు సేవ ఒక సాధనం లాంటిదని అన్నారు. పుట్టిన ఊరు కన్నతల్లీ లాంటిదని, సేవ చేసి ఊరు రుణం తీర్చుకోవాలని అన్నారు. ఊరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యమని,అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలని, ప్రజలు, ముఖ్యంగా మహిళలు చైతన్యవంతులైతే ఇల్లు మారుతుందని అన్నారు. పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేసేందుకే ఇంటింటికి ఈ సేవా కార్యక్రమం ద్వారా వస్తున్నామని,సేవ ఒక్కటే ప్రజల దగ్గరకు చేర్చు తుందని అన్నారు. మన ఊరును మనమే బాగుచేసుకుందామని, అందంగా తీర్చిదిద్దు కుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు నర్సెన కష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.