Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు పండించిన ధ్యానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం లేకుండా నాణ్యతతో తీసుకురావాలన్నారు. కేంద్రం ప్రకటించిన మొక్కజొన్న మద్దతు ధరను టీఎస్ మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మధ్య దళారులకు వరి మొక్కజొన్న అమ్మి రైతులు నష్టపోవద్దని అన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరతో మొక్కజోన్నను కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో మొక్కజోన్న మద్దతు ధర పడిపోయిందని, రైతుల ముసుగులో కొందరు నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. సీఎం కేసిఆర్ రైతుల పక్షపాతి అని రైతులను రాజు చేయడమే సీఎం లక్ష్యమన్నారు. ఎంపీపీ లక్ష్మీ రవి జెడ్పిటిసి విజయ, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మహేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతోష్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాపిరెడ్డి స్థానిక సర్పంచ్ నిషిద్ధర్ రెడ్డి, ఎంపీటీసీ సుమలత బిక్షపతి, బిఆర్ఎస్ రేగొండ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ సీనియర్ నాయకులు ఉమేష్ గౌడ్, రేగొండ టౌన్ అధ్య క్షులు బిక్షపతి, సర్పంచులు రంజిత్ తిరుపతిరెడ్డి , నీల నీలాంబరం, ఎంపీటీసీలు శ్రీధర్, ప్రతాపరెడ్డి, నాయకులు లింగారెడ్డి అశోక్ రెడ్డి , అజరు పాల్గొన్నారు.