Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
ఇటీవల కురిసిన అకాల వ ర్షాల కారణంగా ధాన్యం తడి సిందని రైతులు ఆవేదన చెందా ల్సిన అవసరం లేదని. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని డీ సీసీబీ డైరెక్టర్ పెంచికలపేట పాక్స్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నీరుకుళ్ళ, పెంచికలపేట, హౌస్బుజుర్గ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లా డుతూ రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశామలంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆ త్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ల క్ష్యంతో దేశంలో ఏరాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తు న్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్యేని చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతొ కొనుగోలు చేస్తుందని రైతులు తొందరపడి ధళార్లకు ఆశ్రయించి నష్టపోవద్దని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్య క్షులు అర్షం వరుణ్‌గాంధీ, పెంచికలపేట ఎంపీటీసీ మందపెళ్లి రవీందర్, నీరుకు ళ్ల సర్పంచ్ అర్షం బలరాం, సర్పంచ్ కొరే లలిత-రమేష్, సీఈఓ లక్ష్మయ్య డైరెక్టర్లు ఉడుత రాజేందర్, తోట చంద్రశేఖర్, కుమారస్వామి, కోడూరు రమేష్, జిల్లపెళ్లి సుధాకర్, ఏఈఓ మానస, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.