Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
రైతులు రబీ సీజన్లో పండిం చిన దాన్యం, మక్కలు స్థానిక వ్యవ సాయ మార్కెట్లో కొనుగోలు కేం ద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ సం ధ్యారాణి బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రైతులు పండించిన పంట లకు గిట్టుబాటు ధర చెల్లించేలా గన్నిబ్యాగులు ఎలాంటి ఇబ్బందులకు తావు లే కుండా సకాలంలో అందించి న్యాయం చేయాలని అన్నారు. కొలతల్లో తేడా రా కుండా రైతులకు న్యాయం చేసేలా స్థానిక అధికారులు దగ్గర ఉండి ప్రతిరోజు పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్లు నాగయ్య, లింగమూర్తి ,జిల్లా వ్యవసాయ కమిటీ అధికారి సురేఖ, ఆర్డిఓ రాము నాయక్, తహశీల్దార్ జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా పతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సంగెం : మండలంలోని చింతలపల్లి గ్రామంలో సంఘమేశ్వర మహిళా రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ ఎఫ్ పి సి (సెర్ప్)ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం, చింతలపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం లోహిత గ్రామంలో గ్రామైఖ్య సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ కందకట్ల కళావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కందకట్ల నరహరి,లోహిత సర్పంచులు నాగినేని జ్యోతిజగన్మోహన్ రావు, మోహన్, గుగులోతు రవి, చింతలపల్లి ఎంపిటిసి బొమ్మ పావని,సొసైటీ చైర్మన్ బొమ్మగాని వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ బండి రాధిక, సొసైటీ చైర్మన్ దొమ్మటి సంపత్,ఏఓ యాకయ్య ఎఫ్బిసి అధ్యక్షులు పాలక లక్ష్మీ, ఏపీఎం కిషన్, ఏఈఓ సమత,సీసీ లు రాజయ్య, కృష్ణమూర్తి, కుమార స్వామి,సొసైటీ వైస్ ఛైర్మన్ రవి,రైతుబందు అధ్యక్షులు బొమ్మ యుగేందర్, రైతులు శ్రీనివాస్,రాజ్ కుమార్,శ్రీమతి,ఉమాదేవి, ఇతర మండల ప్రజాప్రతినిధులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.