Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కొత్తగట్టు సిం గారం శివారులోని మొక్కజొన్న పంట క్షేత్రంలో ప్రమాదవశాత్తు ని ప్పంటుకొని నాలుగున్నర ఎకరాల మొక్కజొన్న పంట దహనమైనట్లు రైతులు నీల సురేందర్‌రెడ్డి, పెంబ ర్తి కుమార్ తెలిపారు. బాధిత రైతుల కథను ప్రకారం మొక్కజొన్న పంట చేతికి రావడంతో బుధవారం పంటను పంట కోతమిషన్ సహాయంతో కోస్తున్న క్రమం లో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకుంది. అక్కడే ఉన్న రైతు లు మంటను చల్లార్చి ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పరకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా శకటం వచ్చినప్పటికీ బురదలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయ బావిలోని నీటితో మంటలను చల్లార్చారు. ఈ ఘటనలో నీల సురేందర్‌రెడ్డికి చెందిన మూడు ఎక రాల పంట, పెంబర్తి కుమార్ కు చెందిన ఎకరం 20 గుంటల లో పండించిన పంట, మాడ విజేందర్కు చెందిన డ్రిప్ పైపులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలి పారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ విస్తరణ అధికారి అహ్మద్ రజా, ఉప సర్పంచ్ సుమన్ సందర్శించి పరిశీలించారు. పంట నష్టంపై ఉన్నతాధికాలకు నివేదిక సమర్పించనున్నట్లు ఏఈఓ రజా తెలిపారు. అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని ఉప సర్పంచ్ సుమన్ కోరారు.