Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
మండలంలో సంచలనం రేపిన వివాహిత హ త్యకేసు విషయంలో సంగెం పోలీసులు అనతి కాలం లో చేణతీంచి నిందితులను బుదవారం అరెస్టు చేసి వివరాలను వెల్లడించారు. ఈనెల ఆరవ తేదీ జరు పుల శౌరిని అతి దారుణంగా హత్య చేసి రోడ్డు మా ర్గాన పడవేసిన సంఘటన తెలిసిన విషయమే.. ఈ కేసు విషయమై పోలీసులు గత మూడురోజుల్లో దా రుణమైన హత్య కేసును చేదించి నిందితులను అదు పులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే పల్లార్ గూ డ,వంజరపల్లి గ్రామాల మార్గంలో గుర్తుతెలియ ని వివాహిత హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడవేసి వెళ్లారు.ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అతితక్కువ సమయంలో హత్య కేసును చేధించడం గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు. వివ రాల్లోకి వెళితే పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపిన వివ రాల ప్రకారం నల్లబెల్లి గ్రామ, జగ్గునాయక్ తండాకు చెందిన జరుపుల సురేష్ తన తల్లి జరుపుల శౌరిని ఆస్తి కోసమై హత్య చేసి రోడ్డు మార్గాన మత దేహాన్ని పడవేసి వెళ్లారు. తన తల్లితో 30 గుంటల భూమి విషయంలో తగాదా జరిగిన ఉదంతం హత్యకు దారి తీసిందని తెలిపారు.మృతురాలికి భర్త ఇద్దరు కుమా రులు ఉన్నారు మృతురాలి భర్త, రెండవ కుమారుడు గత కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. భూ తగాదా విష యంలో పెద్దకొడుకు సురేష్ పెద్దమనుషుల సమ క్షంలో తీర్మానం చేసుకోగా,ఆమెను అడ్డు తొలగించే క్రమంలో తల్లినిహతమార్చి భూమిని స్వాధీన పర్చు కోవచ్చని ఒక దుర్మార్గపు ఆలోచనతో తల్లిని హత్య చేశాడు. ఈ హత్య ఉదంతంలో ఆటో డ్రైవర్ నల్లబెల్లి గ్రామానికి చెందిన షేక్ రఫీ సహకరించాడని తెలియజేశారు. తన తల్లిని హతమార్చాలని ఉద్దేశం తో మాయ మాటలు చెప్పి షేక్ రఫీ ఆటోలో మచ్చా పూర్ నుండి వంజరపల్లి గ్రామాల మధ్యలో మాయ మాటలతో నమ్మబలికి ఆమెను ఆటోలో కిందపడేసి తొక్కే క్రమంలో ఆటో డ్రైవర్ అడ్డుపడగా అతనికి నిలువరించి,ఆటో కిస్తీని తనే కడతానని మాయ మాటలు నమ్మబలికి అతని ఒప్పించి అతని సాయం తో వంజరపల్లి గ్రామ శివారులో బండరాయితో కొట్టి చంపారని తెలిపారు.హత్య చేసిన జరుపుల సురేష్ ను బుధవారం అరెస్టు చేయగా అతనికి సహకరిం చిన షేక్ రఫీ పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. పోలీసులకు చిక్కకుండా హత్యకు ఉపయోగించిన బండరాయిని, నిందితుడి రక్తపు బట్టలను ఆటోలో ప్రయాణిస్తూ సమీపంలోని మహారాజా తండాలో ఉన్న ఒక సాగునీటి బావిలో పడవేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఎవరి ఇండ్లకు వారు చేరుకున్నారు.
ఈ విషయాన్ని పోలీసులు చేదించి నిందితుడిని అరెస్టు చేశారు. వంజరపల్లె గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మతురాలి పెద్ద కుమారుడు జరుపుల సురేష్ అతని సహచరుడు షేక్ రఫీ ఈ హత్య చేశారని పోలీసులు సమక్షంలో ఒప్పుకున్నాడు. సురేష్పోలీసుల సమక్షం లో బుధవారం లొంగిపోయాడు.
ఈ కేసును చేదించడంలో పోలీసులు పర్వతగిరి సీఐ శ్రీనివాస్, సంగెం ఎస్సై భరత్,హెడ్ కానిస్టేబుల్ కాసిం,చందర్, కానిస్టేబుళ్లు కుమారస్వామి, శ్రీనివాస్ అరుణ పాల్గొన్నారు.