Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ఎవరైనా ఆక్రమ వ్యాపారం చేస్తే సహించేది లేదని నెల్లికు దురు ఎక్సైజ్ సీఐ అశోక్, ఎస్సై క్రాంతి కిరణ్ అన్నారు. మండ లంలోని కాచికల్ గ్రామ శివారులోని ఓపాడుబడ్డ ఇండ్లలో 20 క్వింటాల నల్ల బెల్లం నిల్వ చేసి ఉండడంతో పక్కా సమాచారం తో పట్టుకున్నట్లు ఎక్సైజ్, సివిల్ పోలీసులు తెలిపారు. నిబం ధనలకు విరుద్ధంగా నడిచినట్లైతే ఊరుకునేది లేదని చట్టపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ యాకన్న, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, ఎక్సైజ్ హెడ్ కానిస్టే బుల్ రబ్బాని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.